Nivetha Thomas: పెళ్లి అనుకున్నారు నివేదా థామస్ షాకిచ్చింది.!
June 26, 2024 / 06:34 PM IST
|Follow Us
మొన్నటికి మొన్న ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టాడు. ‘డార్లింగ్స్.. మన జీవితంలోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది’ అనేది ఆ స్టోరీ యొక్క సారాంశం. దీంతో ‘ప్రభాస్ (Prabhas) జీవితంలోకి… అతని ఫ్యాన్స్ జీవితంలోకి వచ్చే స్పెషల్ పర్సన్ అతని లైఫ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు’ అంటూ ముందు వెనుక చూడకుండా, కనీసం దాని గురించి ఆలోచించకుండా ఆ స్టోరీని వైరల్ చేసేశారు నెటిజెన్లు.
ఆఖరికి న్యూస్ ఛానల్స్ సైతం ఆ స్టోరీ గురించి డిస్కషన్స్ మీద డిస్కషన్స్ పెట్టిన సంగతి తెలిసిందే. కానీ చివరికి అది ‘బుజ్జి అనే కార్ కోసమని’ తెలుసుకుని ఉసూరుమన్నారు. బహుశా ప్రభాస్ ను చూసే అనుకుంట నివేదా థామస్ (Nivetha Thomas) కూడా అలాంటి ఓ ప్రమోషనల్ స్ట్రాటజీ ప్లే చేసింది. వివరాల్లోకి వెళితే.. ‘ఎన్నో రోజుల తరవాత.. ఫైనల్లీ..’ అని ఓ లవ్ సింబల్ పెట్టి నిన్న ఓ ట్వీట్ వేసింది నివేదా థామస్.
దీంతో కచ్చితంగా ఆమెకు పెళ్లి ఫిక్స్ అయ్యుంటుంది అంటూ నెటిజెన్లు ఆ ట్వీట్ ను వైరల్ చేశారు. కానీ కట్ చేస్తే అది.. సినిమా ప్రమోషన్ కోసం వేసిన ట్వీట్ అని తేలింది. ప్రియదర్శి.. నివేదా థామస్ కాంబినేషన్లో ’35 – ఇది చిన్న కథ కాదు’ అనే సినిమా రూపొందుతుంది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై రానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ మొత్తం పెళ్లి నేపథ్యంలో సాగుతుంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది.
నందకిషోర్ డైరెక్ట్ చేశాడు.ఆగస్టు 15 న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ ప్రకటన పై నివేదా స్పందిస్తూ.. ”ఇలాంటి మంచి స్క్రిప్ట్ కోసం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాను. మొత్తానికి దొరికింది” అంటూ నిన్న చేసిన ట్వీట్ కి క్లారిటీ ఇచ్చింది. దీంతో ‘ప్రభాస్ టెక్నిక్ నే నివేదా కూడా వాడింది’ అని కొందరు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.