Nivetha Thomas: నివేదా థామస్ ప్లానింగ్ బానే ఉంది.. కానీ..!

  • June 2, 2021 / 06:10 PM IST

నివేదా థామస్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.నాని- ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘జెంటిల్ మెన్’ చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అటు తర్వాత ‘నిన్ను కోరి’ ‘జై లవ కుశ’ ‘118’ ‘బ్రోచేవారెవరురా’ ‘దర్బార్’ ‘వి’ ‘వకీల్ సాబ్’ వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభం నుండీ ఈమె కథాబలం ఉన్న చిత్రాల్లోనే..నటిస్తూ వస్తుంది.అయితే గ్లామర్ షో విషయంలో ఈమె హద్దులు పెట్టుకుందట.

అందుకే మొదటి నుండీ గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంటూ వస్తోంది.అందుకే ఈమెకు అవకాశాలు కూడా అరుదుగానే వస్తున్నాయి. మొదటి రెండు సినిమాల్లో తప్ప.. ఈమె ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా నటించిన సినిమా లేదు. మొహమాటానికి, పారితోషికానికి.. పోయి సినిమా ఓకే చేసే హీరోయిన్ అయితే అస్సలు కాదు. ఈమె కెరీర్ ప్రారంభించిన 5 ఏళ్ళలోనే చేతివరకు వచ్చిన చాలా సినిమాల్లో నటించి క్యాష్ చేసుకునే అవకాశాన్ని వదులుకుంది.

అయితే ఈమెకు సోలో హీరోయిన్ గానే నటించాలి అనే కోరిక లేదట..! తనకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రల్నే చేస్తాను అంటూ ధీమాగా చెప్పుకొస్తుంది. అంతేకాదు నివేదా థామస్ కు డైరెక్టర్ కావాలనే కోరిక ఉందట.నిజానికి ఈమె చిన్నప్పటి నుండీ సినిమాల్లో నటిస్తోంది. దాంతో ఈమెకు 24 క్రాఫ్ట్స్ పై అవగాహన ఉంది. హీరోయిన్ గా కొన్నాళ్ళు చేసిన తర్వాత డైరెక్షన్ వైపు కూడా అడుగులు వేస్తానని చెబుతుంది ఈ అమ్మడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus