టాలీవుడ్ ను ఊపేసిన గోడవల్లో ఈ డ్రగ్స్ ఒకటి అని చెప్పక తప్పదు…దాదాపుగా 27మందిని గుర్తించాం…11మందికి నోటీసులు పంపించాం…ఇనాక్ చెప్పాలి అంటే దీనిపై మీడియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు అనే చెప్పాలి.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోయే లాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో దాదాపు టాప్ పొజిషన్ లో ఉన్న అందరినీ లాక్కొచ్చి మరీ విచారణ జరిపించారు అన్న కోణంలో మీడియా చేసిన హడావిడి, హంగామా అంతా ఇంతా కాదు…ప్రతీ ఛానెల్ క్షణం క్షణం ఆసక్తిగా సస్పెన్స్ తో ఎపిసోడ్ లు నడిపించారు. ఉదయం నుంచీ సాయంత్రం దాకా హడావిడిగా బ్లడ్ సాంపిల్స్ తో సహా అన్నీ తీసుకుని చెమటలు పట్టించారు. వచ్చిన సెలెబ్రిటీ లు ఏ రంగు చొక్కా వేసుకుని వచ్చారు, ఎలాంటి వారు , వారి పుట్టు పూర్వాత్రాలు ఏంటి , వారు మందు తాగుతారా లేదా .. ఇలా రకరకాల ప్రశ్నల మధ్యన గంటల గంటల విచారణ సాగింది. ఒక పక్క ఈ కేసులో ఇప్పటివరకూ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కెల్విన్, జిశాన్, మైక్ కమింగాలు సహా మొత్తం 20 మందిని అరెస్ట్ చేసిన అధికారులు త్వరలో వారిపై చార్జ్ షీట్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న సంధర్భంలో… ఇప్పటివరకూ 11 మంది సినీ ప్రముఖులను దాదాపు 88 గంటల పాటు విచారించిన సిట్, అరెస్టయిన నిందితులకు డ్రగ్స్ దందాపై పై స్థాయిలో ఉన్న లింకులను ఛేదించలేకపోయిందని వార్తలు ఇప్పుడు బయటకు వస్తూ ఉండడంతో.
వీళ్ళ విచారణ అంత కొండను తవ్వి ఎలుకను పట్టుకోవడమే అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అసలైతే ఈ 11 మంది లో విచారణ ఎదురుకొంటున్న ఇద్దరు సినిమా ప్రముఖుల అరస్ట్ తప్పదు అన్నట్టు మాట్లాడారు సిట్ అధికారులు ఖచ్చితంగా చెప్పారు…కానీ ఏమయిందో ఏమో తెలీదు కానీ…విచారణ ఎదుర్కున్న వారెవ్వరినీ అరస్ట్ చెయ్యడం కోసం తగిన ఆధారాలు సిట్ వద్ద లేవు అని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అదే నిజం అయితే ఈ కేస్ సైడ్ ట్ర్యాక్ తీసుకున్నట్లే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.