దిల్ రాజుకి కలిసి రాని దేవుని పేరుతో నిర్మించే సినిమాలు
August 11, 2018 / 07:46 AM IST
|Follow Us
దిల్ రాజుకి కథ ఎలా రాయాలో తెలియదు. కానీ ఎలా రాస్తే బాగుంటుందో తెలుసు. సినిమా ఎలా తెరకెక్కించాలో తెలియదు.. కానీ ఎలా తీస్తే జనాలు మెచ్చుతారో తెలుసు. అందుకే సినిమా పంపిణీ విభాగంలో ఉంటూ లాభాలను అందుకున్నారు. అతను బాగుందంటే ఆ సినిమా హిట్. అతను కొనలేదంటే అది ఫట్.. అనే రీతిలో ప్రచారం సాగింది. ఆ నమ్మకంతో తన ఇష్టదైవం పేరుతో వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థని స్థాపించారు. దిల్ సినిమా నుంచి వరుసగా విజయాలను అందుకున్నారు. ఒక ఏడాదిలో మూడు సినిమాలను నిర్మించే స్థాయికి ఎదిగారు. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా మారారు. కానీ అతనికి ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. అదేమిటంటే దేవుని పేరుతో సినిమాలు నిర్మిస్తే హిట్ కాదని తెలుస్తోంది. దేవుడి పేర్లతో దిల్‌రాజు నిర్మించిన సినిమా ‘రామరామ కృష్ణకృష్ణ’.
ఈ టైటిల్ ఇద్దరు దేవుళ్ళు రాముడు, కృష్ణుడు ఉన్నారు. ఆ సినిమాలో హీరో రామ్. అతడిదీ దేవుడి పేరే. కానీ, సినిమా హిట్ కాలేదు. సునీల్ హీరోగా వాసువర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “కృష్ణాష్టమి”. కృష్ణుడి పేరు, పండగ కలిసి వచ్చేలా టైటిల్ పెట్టిన ఈ మూవీ తొలిరోజు కూడా మంచి కలక్షన్స్ అందుకోలేకపోయింది. తాజాగా ఇష్టదైవం వెంకటేశ్వరుని పేరు వచ్చేలా టైటిల్ పెట్టిన సినిమా “శ్రీనివాస కల్యాణం”. శతమానం భవతి మూవీతో అవార్డు అందుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మూవీ మొదటి నుంచి మంచి స్పందన అందుకుంది. ఆగస్ట్ 9 న రిలీజ్ అయిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో దిల్‌రాజుకి టైటిల్స్‌లో దేవుడి పేర్లు పెడితే కలిసి రాదని సినీ విశ్లేషకులు తేల్చి చెప్పారు. సో దిల్ రాజు ఇక కథ, డైరక్టర్స్ విషయంలోనే మాత్రమే కాదు టైటిల్ విషయంలో జాగ్రత్తగా ఉంటారేమో.