Ketika Sharma: కేతిక శర్మకి ఏమీ కలిసి రావడం లేదు..పాపం!

  • December 13, 2022 / 07:24 PM IST

హీరోయిన్లకు పెట్టుబడి అనేది వారి అందాల ఆరబోతే. ఎంత ఎక్కువగా అందాలు ఆరబోస్తే అంత క్రేజ్ పెరుగుతుంది. తద్వారా సినిమాల్లో అవకాశాలు వస్తాయి. ఇక్కడి వరకు కరెక్టే. కానీ అందాల ఆరబోతతో వచ్చిన ఇమేజ్ నిలబడాలి అంటే వచ్చిన ఛాన్స్ లు కూడా సక్సెస్ అవ్వాలి. కొంతమంది భామలకు అదే కలిసి రావడం లేదు. ఆ లిస్ట్ లో కేతిక శర్మ కూడా ఉంది. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీతో ఈమె ఎంట్రీ ఇచ్చింది.

ఆ మూవీ సో సో గా ఆడింది కానీ ఈమె గ్లామర్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈమెకు వెంటనే నాగ శౌర్య హీరోగా రూపొందిన ‘లక్ష్య’ లో అవకాశం వచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక ఈ ఏడాది వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’ మూవీ కూడా నిరాశపరిచింది. దీంతో ఈ అమ్మడికి అవకాశాలు లేకుండా పోయాయి. అందుకే సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో దండయాత్ర చేయడం మొదలుపెట్టింది. 26 ఏళ్ళ ఈ సుందరి చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు.

నడుము అందాలు, క్లీవేజ్ అందాలు వడ్డించడంలో ఈమె స్టైలే వేరు. ఈమె సోషల్ మీడియా ఖాతాకి 2.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అందువల్ల ఈమె ఫోటోలు వెంటనే వైరల్ అవుతాయి. ఫోటోలకు రీచ్ వస్తే సరిపోయిందా? అవకాశాలు రాకపోతే ఆ రీచ్, లైక్స్ ఎందుకు పనికొస్తాయి. ఇదే ఆలోచన కేతిక శర్మకి కూడా ఉంది. వరుసగా ఆడిషన్లు ఇస్తుంది.ఈసారైనా మంచి పాత్రలు ఎంపిక చేసుకోకపోతే భవిష్యత్తు ఇంకా ప్రశ్నార్ధకంగా మారింది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus