బుల్లితెరపై అత్యంత ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతున్నటువంటి రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి అని చెప్పాలి. వివిధ భాషలలో ప్రసారమవుతూ ఎంత మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ కార్యక్రమం తెలుగులో కూడా ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఏడవ సీజన్ కూడా ప్రసారం కాబోతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ వచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమం తెలుగులో ఆరవ సీజన్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది రేటింగ్స్ పరంగా కూడా ఈ సీజన్ దారుణమైన రేటింగ్స్ ఎదుర్కొంది.
ఇలా ఈ కార్యక్రమానికి రేటింగ్స్ రాకపోవడానికి కారణం అందరూ కొత్త వాళ్ళని హౌస్ లోకి పంపించడం అలాగే నాగార్జున వ్యవహార శైలి కూడా నచ్చకపోవడంతో ఈ షో రేటింగ్ సొంతం చేసుకోలేకపోయింది. నాగార్జున కంటెస్టెంట్ ల పట్ల పక్షపాతంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే వచ్చే సీజన్ కి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించరు అంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి.అయితే ఇదంతా ఆ వాస్తవమని తాజాగా నాగార్జునకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
అయితే నాగార్జున (Nagarjuna) పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన ఈయననే ఎందుకు హోస్టుగా ఎంపిక చేసుకున్నారన్న సందేహం కూడా తలెత్తింది. ఈ విధంగా నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించడానికి మరే కారణం లేదు.ఈ కార్యక్రమానికి ఇతర స్టార్ హీరోలు ఎవరూ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక స్టార్ హీరోలు కాకపోతే టైర్ 2హీరోలను ఎంపిక చేసినప్పటికీ నానికి ఈ కార్యక్రమం పట్ల అనుభవం ఉన్న ఆయన చేయడానికి ఆసక్తిగా లేరు.
విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ వంటి యాటిట్యూడ్ ఉన్నోళ్లు సెట్ అవుతారు. కానీ చేయడానికి ముందుకు రావాలిగా. నాగార్జున పట్ల వ్యతిరేకత ఉన్న తనని ఈ కార్యక్రమానికి హోస్టుగా ఎంపిక చేసుకున్నారంటే ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించడం కోసం మరెవరు ముందుకు రాని పక్షంలోనే ఆయనను ఎంపిక చేసుకున్నారని అర్థమవుతుంది.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు