యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ బాహుబలి తో ఇండియన్ సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నారు. చిన్న వయసులోనే ప్రపంచమంతా హీరోగా గుర్తింపు పొందారు. తన సాహసాలతో చైనీయులకు కొత్త మార్షల్ ఆర్ట్స్ నటుడిగా కీర్తి దక్కించుకున్నారు. తాజాగా డార్లింగ్ పడ్డ శ్రమను, ఆదరణను గుర్తించి “మేడం టుస్సాడ్” వాళ్లు బ్యాంకాక్ లోని తమ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పనులు మొదలు పెట్టారు.
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరోకు దక్కిన అరుదైన గౌరవం ఇది. ఇప్పటి వరకు తెలుగులోనే కాదు సౌత్ ఇండియాలో ఏ నటుడికి ఈ అవకాశం లభించలేదు. అంతటి ఘనత సాధించిన ప్రభాస్ ని టాలీవుడ్ పట్టించుకోలేదు. ఏ స్టార్ హీరో అభినందించిన పాపాన పోలేదు. కనీసం మీడియాకు ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ వైపు నుంచి కూడా ఏ స్పందన లేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఆ నాలుగు కుటుంబాలే అనే విమర్శ మరో సారి స్ప్రెడ్ అవుతోంది.