Chiru, Balayya: సంక్రాంతికి దిల్ రాజు ఆ ఆలోచన చేశారా!
December 12, 2022 / 12:59 PM IST
|Follow Us
పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు.. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు.. ఈ కామెంట్ మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఈ మధ్య కాలం వరకు ఈ కామెంట్ మనం వినిపించేవి. అయితే వచ్చే సంక్రాంతికి రాబోయే సినిమాల విషయంలో చర్చ పై వాక్యానికి అచ్చంగా ఆపోజిట్‌గా వినిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాల కోసం సరైన థియేటర్లు దొరకడం లేదు. అవును మీరు చదివింది నిజమే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే ప్రశ్న. దీనికి సపోర్టెడ్‌గా మరో మాట ఇప్పుడు వినిపిస్తోంది. అదే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు సరైన సింగిల్ థియేటర్స్ లభించడం లేదట.
క్లాస్ సినిమాను మల్టీప్లెక్స్‌ల్లో చూడాలి. మాస్ సినిమాను సింగిల్ స్క్రీన్స్‌లో చూడాలి అంటారు. సంక్రాంతికి రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ కానీ, ‘వీర సింహా రెడ్డి’ కానీ ఫుల్ మాస్ సినిమాలు. వీటిని సింగిల్ స్క్రీన్స్‌లోనే చూడాలని అభిమానులు అనుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే… చిరుకి, బాలయ్యకి సింగిల్ స్క్రీన్లు ఉన్న థియేటర్లు, ప్రాంతాల్లో థియేటర్లు దొరకడం లేదట. వాటిల్లో డబ్బింగ్ సినిమా ‘వరిసు’ / ‘వారసుడు’ సినిమా పడేలా అగ్రిమెంట్లు జరిగిపోయాయట. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చ.
సంక్రాంతికి స్ట్రయిట్ సినిమాలు ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’ పోటీ పడుతున్న దిల్ రాజు ‘వరిసు’కి థియేటర్ల కేటాయింపు జోరుగా సాగుతోందట. సింగిల్ స్క్రీన్లు, డబుల్ స్క్రీన్లు ఉన్న చోట వందకు పైగా సెంటర్లలో ‘వారసుడు’ ఫిక్స్ అయిపోయిందట. అంటే ఒక ఏరియాలో ఒకటో, రెండో థియేటర్లు ఉంటే ముగ్గురు హీరోలకూ షోలు దొరకడం కష్టం అంటున్నారు. దొరకని హీరోల్లో చిరంజీవి, బాలయ్య ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఒకవేళ ‘వారసుడు’ సినిమాను తీయాల్సి వస్తే.. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆ సినిమా జనవరి 14న విడుదలవుతుందని టాక్. అలా దిల్ రాజు అండ్ టీమ్ బలంగా ప్లాన్స్ వేసిందని టాక్.