అయ్యో పాపం.. విజయ్ కి ఇలా కూడా దెబ్బ పడేలా ఉందే..!

  • February 3, 2020 / 10:17 AM IST

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్.. వంటి క్రేజీ భామలు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ పై కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు క్రాంతి మాధవ్ ఫామ్లో లేడు. ఇక హీరో విజయ్ దేవరకొండ గత చిత్రం ‘డియర్ కామ్రేడ్’ డిజాస్టర్ అయ్యింది. ఇక ఫిబ్రవరి లో విడుదలయ్యే సినిమాలని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు అనే టాక్ కూడా ఎలానూ ఉంది. పోనీ టీజర్ అయినా ఆకర్షించే విధంగా ఉందా అంటే.. అందులో విజయ్ గత చిత్రాల ఛాయలు ఎక్కువ ఉండడంతో.. పెద్దగా హైప్ ఏర్పడటం లేదు.

ఇప్పుడు ఈ చిత్రానికి మరో సమస్య వచ్చి పడిందనేది తాజా సమాచారం. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కానీ ఈ చిత్రానికి ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం లేదని నిర్మాత కె.ఎస్.రామా రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ చిత్రానికి వారం రోజుల ముందు అంటే.. ఫిబ్రవరి 7న సమంత, శర్వానంద్ ల ‘జాను’ విడుదల కాబోతుంది. దీనికి నిర్మాత దిల్ రాజు కాబట్టి నైజాం లో ఎక్కువ థియేటర్స్ లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. రెండు వీకెండ్ లకు సరిపడగా థియేటర్లు ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. అందుకే విజయ్ సినిమాకి ‘డియర్ కామ్రేడ్’ లా ఎక్కువ థియేటర్లు దొరికే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus