బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న నోయెల్ ఆరువారాల బిగ్ బాస్ ఆటలో రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో నోయెల్ ప్రేక్షకులకు బాగా తెలుసు. ర్యాప్ సింగర్ గానే కాకుండా నటుడిగా కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తరువాత నోయెల్ గేమ్ స్ట్రాటజీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సింపతీ కోసం సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటూ విమర్శలు వచ్చాయి. ఇక రీసెంట్ గా హౌస్ మేట్స్ అందరూ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ఈ క్రమంలో నోయెల్ తన తల్లి ఇళ్లల్లో పని చేసేదని.. తండ్రి ఇస్త్రీ పని, కూలి పని ఇలా ఎన్నో చేస్తూ డబ్బులు సంపాదించేవాడని చెప్పాడు. నోయెల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామని గూగుల్ సెర్చ్ చేస్తే.. నోయెల్ తండ్రి సామ్యూల్ రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని రాసి ఉంది. దీంతో నోయెల్ సింపతీ కోసం అబద్దాలు చెప్పాడంటూ అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ విషయంపై నోయెల్ తమ్ముడు జోయెల్ క్లారిటీ ఇచ్చాడు. తన అన్నపై కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వికీపీడియాలో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ని ఎడిట్ చేసుకోవచ్చి.. దాన్ని తీసుకొని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు.
తన అన్న చెప్పినట్లుగానే తమ తండ్రి ఇస్త్రీ పని చేసేవారని.. దానికి ప్రూఫ్ గా ఓ ఫోటోని షేర్ చేశారు. ఆ తరువాత డిఫెన్స్ రీసెర్చ్ లో జాబ్ రావడంతో అక్కడ జాయిన్ అయ్యారని చెప్పాడు. అది కూడా ఆఫీసర్ ఉద్యోగం కాదని.. డీఆర్డీవోలో సెక్యూరిటీగా తమ తండ్రి పని చేశారని వెల్లడించారు. అలానే నోయెల్ తమ తండ్రి గురించి చెబుతున్నప్పుడు జాబ్ ట్రైల్స్ లో ఉన్నప్పుడు ఇస్త్రీ పని చేసేవాడని క్లియర్ గా చెప్పాడని.. కానీ కావాలనే తప్పుడు సమాచారంతో ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తన అన్న కోసం పీఆర్ టీమ్ పని చేస్తుందనే విషయంపై స్పందిస్తూ.. ఎలాంటి పీఆర్ టీమ్ లేదని.. అప్పుడప్పుడు తనే సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్న విషయాన్ని చెప్పాడు జోయల్.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!