Malaika Arora: పాతికేళ్లకే జీవితం అయిపోదు.. మలైకా ఫైర్..!
January 15, 2022 / 12:55 PM IST
|Follow Us
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా చాలా కాలంగా డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే వయసురీత్యా వీరిద్దరి మధ్య 12 ఏళ్ల గ్యాప్ ఉంది. అర్జున్ కంటే మలైకా పన్నెండేళ్లు పెద్దది. దీంతో వీరి రిలేషన్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటికప్పుడు వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.
ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ నాలుగేళ్ల ప్రేమ బంధానికి వీరు బ్రేకప్ చెబుతున్నట్లు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీటిపై అర్జున్ కపూర్ స్పందించిన విషయం తెలిసిందే. మలైకాతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ తాము విడిపోతున్నట్లు వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టారు. తాజాగా మలైకా అరోరా కూడా తమ రిలేషన్షిప్ పై స్పందించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది.
’40 ఏళ్ల వయసులో ప్రేమలో పడటం సాధారణం విషయంగా భావించండి.. మీ 30 ఏళ్ల వయసులో కొత్త కలలను కని సాధించడానికి ప్రయత్నించొచ్చు.. మీ 50 ఏళ్ల వయసులో మిమ్మల్ని, మీ లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. 25 ఏళ్లతో జీవితం ముగిసిపోదు. అలా ఆలోచించడం మానేద్దాం’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తో అర్జున్ కపూర్, మలైకాల మధ్య వయసు గురించి ప్రశ్నిస్తున్న వారందరికీ గట్టి సమాధానమిచ్చినట్లైంది.