ఎన్టీఆర్, విజయ్ సినిమాలపై మొదలయిన చర్చ

  • March 3, 2017 / 12:32 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా మొదలు అనగానే అది రిలీజ్ అయ్యే వరకు దానిపై అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. తమిళ హీరో విజయ్ చిత్రంపై కూడా చర్చ జరగడం కామనే. కానీ వీరిద్దరి సినిమాలకు ముడిపెడుతూ ఓ రూమర్ హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్నారు. తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా వైవిధ్యమైన నటనను ప్రదర్శించనున్నారు. ఇక తమిళ హీరో విజయ్ కూడా ఇప్పుడు అట్లీతో ఓ సినిమాను చేయనున్నారు. ఇందులో విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు బయటికి వచ్చింది.

అంతేకాదు .. ఆ మూడు పాత్రలు ఎన్టీఆర్‌ సినిమాలోని విధంగా.. తండ్రి, ఇద్దరు కొడుకులుగా ఉంటుందంట. ఈ పోలికే చర్చకు దారి తీసింది. అంతేకాదు  విజయ్ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించడం కొత్త సందేహాలకు అవకాశాన్ని కల్పించాయి. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథే తెలుగులో ఎన్టీఆర్, తమిళం లో విజయ్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలవారు చెప్పుకుంటున్నారు. ఈ వార్తలో ఎంత నిజముందో త్వరలో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus