పొల్లాచ్చి షెడ్యూల్ కి సిద్ధమవుతున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ బృందం

  • June 11, 2018 / 10:03 AM IST

అజ్ఞాతవాసి సినిమా అపజయంతో త్రివిక్రమ్ దెబ్బతిన్న పులిలా ఉన్నారు. హిట్ కొట్టేవరకు సరిగ్గా నిద్రపోయేటట్టు లేరు. అందుకే ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమాని శ్రద్ధగా తెరకెక్కిస్తున్నారు. అనేక జాగ్రత్తలు తీసుకొని మరీ షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ శివారులలో విజయవంతంగా పూర్తి చేసిన మాటల మాంత్రికుడు…. రామోజీ ఫిలిం సిటీలోను భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. నాలుగు కోట్లతో నిర్మించిన రాయలసీమ గ్రామం సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ తో పూజా హెగ్డే టాకీ పార్ట్ కూడా పూర్తి అయింది. ఇక తాజా షెడ్యూల్ ని పొల్లాచ్చి లో ప్లాన్ చేశారు.

ఈ షెడ్యూల్ లో కొన్ని సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ ను కూడా తెరకెక్కించనున్నారు. ఈ నెల 18 నుంచి మొదలయ్యే ఈ షెడ్యూల్ జులై మొదటి వారం వరకు జరుగనుంది. దీని తరువాతి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ యూరప్ వెళ్లనుంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ తొలిసారి నందమూరి హీరోతో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus