హరితేజకి ఫ్యాన్ అయిన ఎన్టీఆర్!

  • September 21, 2017 / 11:42 AM IST

బుల్లి తెరపై చిన్న చిన్న షోస్ చేసుకునే హరితేజ కెరీర్ ఊపందుకోనుంది. వెండితెరపై వెలిగిపోనుంది. ప్రస్తుతం ఈమె గురించే టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటీవీ వంట కార్యక్రమాల ద్వారా టీవీ ప్రేక్షకులకు తెలిసిన హరితేజ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ.. ఆ మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టింది. విన్నర్, ఉంగరాల రాంబాబు వంటి సినిమాల్లో అవకాశం అందుకుంది. అప్పటి వరకు స్లో గా నడిచిన ఆమె కెరీర్ బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆమెలోని ప్రతి ట్యాలెంట్ ని బయటపెట్టడానికి ఈ షో వేదికైంది. ఆమె నటన, వ్యక్తితంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ కూడా హరితేజకి ఫ్యాన్ అయిపోయారు.

అందుకే షో ముగిసిన తర్వాత ఫలితమతో సంబంధం లేకుండా తన ప్రతి సినిమాలో హరితేజకి ఓ రోల్ తప్పకుండా ఇవ్వడానికి తారక్ రెడీగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు తనకి తెలిసిన దర్శకుల సినిమాల్లోనూ హరితేజకి సరిపోయే రోల్ ఉంటే ఇవ్వమని స్వయంగా అడగనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ అంతటోడే అనుకుంటే అవకాశాలకు కొరవా.. సో హరితేజ లైఫ్ మారిపోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus