మూడు నెలలపాటు సమయం తీసుకొని అనేక కథలు విన్న తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరక్టర్ బాబీ చెప్పిన కథకు ఒకే చెప్పారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ మూవీ ఈ నెల 9 న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. అనంతరం టెక్నీషియన్లు, ఆర్టిస్టుల ఎంపిక మొదలు కానుంది. తారక్ మాత్రం ఇప్పటినుంచే రంగంలోకి దిగాడు. ఈ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేసే పనిలో పడ్డారు.
తన మేకోవర్ కోసం ముంబై కి చెందిన స్టైలిష్ లను రప్పించారు. వారి ఆధ్వర్యంలో టాప్ టు బాటమ్ చేంజ్ కానున్నారు. యమదొంగ నుంచి మేకోవర్ పై దృష్టి పెట్టిన తారక్ సినిమాకు సినిమాకు కొత్తగా కనిపించడం అలవాటు చేసుకున్నారు. ఊసరవెల్లి, బాద్ షా, నాన్నకు ప్రేమతో చిత్రాల్లో క్యారక్టర్ లోనే కాకుండా స్టైల్ లోను మార్పు తీసుకొచ్చారు. నాన్నకు ప్రేమతో చిత్రంలో అయితే హాలీవుడ్ స్టార్ ని మించిపోయారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేయనున్నారు. గడ్డం, హెయిర్ స్టైల్ పై ఫోకస్ పెట్టారు. అందుకే కొంతకాలంగా జుట్టు పెంచారని అర్ధమవుతోంది. సంక్రాంతి లోపున బాబీ చెప్పిన క్యారక్టర్ లా మారిపోయేందుకు కసరత్తు ప్రారంభించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.