NTR30:ఆ సినిమాటోగ్రాఫర్ కు ఛాన్స్ ఇచ్చిన తారక్!

  • September 15, 2021 / 04:52 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తర్వాత మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్ పూర్తి కావడంతో ఎన్టీఆర్ వచ్చే నెల నుంచి కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీకి ఇప్పటికే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలును ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ రత్నవేలు కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. రంగస్థలం, సరిలేరు నీకెవ్వరు, సైరా నరసింహారెడ్డి మరికొన్ని సినిమాలకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలుకు పలు అవార్డులు సైతం దక్కాయి. త్వరలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ పేరు వినిపిస్తోంది. కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా కొరటాల శివ ఎన్టీఆర్ కు ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus