పూరీ….ఎన్టీఆర్ సినిమా లేనట్లేనా??

  • October 24, 2016 / 05:56 AM IST

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో యంగ్ టైగర్ స్టామినానే వేరు అని చెప్పాలి…అతి చిన్న వయసులోనే టాలీవుడ్ రికార్డులను మడత వేసి జేబులో పెట్టుకున్న ఘనత ఆయనకే సొంతం. అయితే ఫక్తు కమర్షియల్ ఫార్మ్యాట్ సినిమా కాలంలో మన ఉండడంతో ఎన్టీఆర్ సైతం కమర్షియల్ సినిమాలకే మొగ్గు చూపుతున్నప్పటికీ అందులో బలమైన కధ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటాడు…ఇదిలా ఉంటే టెంపర్….నాన్నకు ప్రేమతో…జనతా గ్యారేజ్ ఈ మూడు సినిమాలతో సూపర్ హ్యాట్రిక్ అందుకున్నాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదే క్రమంలో టెంపర్ ను పక్కన పెడితే…జ్యోతిలక్ష్మి-లోఫర్-ఇజం లతో ఫ్లాప్ హ్యాట్రిక్ సాధించాడు మన దర్శకుడు పూరీ. ఇదిలా ఉంటే ఇజమ్ తరువాత ఎన్టీఆర్ పూరితో సినిమా చేస్తాడు అని, కధ సైతం ఎన్టీఆర్ కు పూరీ వినిపించాడు అని ఇజమ్ రిలీజ్ కి ముందు వినిపించిన వార్త.

కానీ ఇజమ్ ఫ్లాప్ కావడం, పైగా పూరీ రొటీన్ ఫార్మాట్ లోనే సినిమా తీయడం, అదే క్రమంలో ఎక్కడా ఏ పాత్రని ఎలివేట్ చెయ్యలేకపోవడం ఇవన్నీ చూస్తుంటే పూరితో సినిమా ఇప్పుడు ఎన్టీఆర్ ను సందిగ్ధంలో పడేసింది. అయితే అంతవరకూ బాగానే ఉంది కానీ….పూరీనే కదా ఎన్టీఆర్ కు టెంపర్ సినిమా ఇచ్చింది అన్న అనుమానం రావచ్చు….నిజమే కానీ….అందులో కధ పూరీది కాదే….ఆ సినిమాకి దర్శకత్వం మాత్రమే పూరీ చేశాడు…ఆ కధను వక్కంతం వంశీ సమకూర్చాడు అని అందరికీ తెలిసిందే…మరి ఇంత డిజాస్త్రేస్ డైరెక్షన్ చేసిన పూరీకి మళ్ళీ ఎన్టీఆర్ అవకాశం ఇస్తాడో..లేక వేరే ఎవరికైనా చాన్స్ ఇస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus