రోప్స్ లేకుండా ఎన్టీయార్ రిస్కీ ఫైట్స్!

  • April 19, 2016 / 01:01 PM IST

సినిమాల్లో హీరోలు గాల్లో ఎంత ఎత్తు లేచి ఫైట్లు చేస్తున్నా.. వారికి సపోర్ట్ గా రోప్స్ ఉండాల్సిందే. అయితే.. ఈమధ్య కాలంలో మాత్రం కథానాయకులు రోప్స్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ లలో నటించేస్తున్నారు. ఇంతకుమునుపు బాలకృష్ణ, మహేష్ బాబులు రోప్స్ లేకుండా ఫైటింగ్ సీన్స్ లో అదరగొట్టారు. ఇప్పుడు వారి బాటలో యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా పయనించనున్నాడు. తన తాజా చిత్రం “జనతా గ్యారేజ్” కోసం అనల్ అరసు కంపోజ్ చేసిన కొన్ని స్టైలిష్ మరియు రిస్కీ ఫైట్ సీన్స్ లో రోప్స్ సహా ఎటువంటి సేఫ్ గార్డ్ లేకుండా సదరు ఫైట్ సీన్స్ లో పాల్గొననున్నాడు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “జనతా గ్యారేజ్” చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా.. ఎన్టీయార్ సరసన సమంత, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళ నటుడు మోహన్ లాల్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus