ఆ మహానటుడి పాత్రలో మెప్పించిన యువ నటుడు

  • May 23, 2018 / 06:06 AM IST

(Mahanati) సావిత్ర పాత్రకు కీర్తిసురేష్ ఏ స్థాయిలో న్యాయం చేసిందో.. అదే స్థాయిలో షాలినిపాండే, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, దుల్కర్ సల్మాన్, క్రిష్ వంటి వారు కూడా అదే స్థాయిలో న్యాయం చేశారు. ఇక తాత అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య అచ్చుగుద్దినట్లుగా కనిపించి, వినిపించి ఆశ్చర్యపరిచాడు. ఇక ఎన్.టి.ఆర్ పాత్రలో జూనియర్ ఎన్.టి.ఆర్ ను నటింపజేయడం కోసం దర్శకుడు నాగఅశ్విన్ అయితే మినీ యుద్ధమే చేశాడు.

కానీ.. తాతగారి పాత్రలో నటించడానికి తాను అనర్హడనని, ఆయన పాత్రలో నటించనని తేల్చి చెప్పేయడంతో వేరే దారిలేక ఆ తారకరముడ్ని గ్రాఫిక్స్ లో ముఖం వరకు రీక్రియేట్ చేసారు. కానీ.. నిజంగా మాత్రం ఆ పాత్రను సూర్య అనే థియేటర్ ఆర్టిస్ట్ ప్లే చేశాడట. ఈ విషయం కాస్త లెట్ గా ఆన్ లైన్ లోకి వచ్చింది. ప్రస్తుతం సూర్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus