ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తున్న ఎన్టీఆర్!
May 24, 2017 / 12:10 PM IST
|Follow Us
కాలానుగుణంగా కథల్లో మార్పు వస్తుంటుంది. జనరేషన్ అభిరుచి మేరకు సినిమాలు చేయాలి. ట్రెండ్ ని ఫాలో అయినవారే ఫామ్లో ఉంటారు. ఇది ఇండస్ట్రీ సూత్రం. ఈ విషయాన్నీ బాల్యంలోనే బుర్రలోకి ఎక్కించుకున్న నటుడు ఎన్టీఆర్. ప్రస్తుతం అతను బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా చేస్తున్నారు. నెగిటివ్ రోల్ ల్లోనూ మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ అంచనాలు నెలకొని ఉన్న జై లవకుశ సెప్టెంబర్ 1 న థియేటర్లోకి రానుంది. ఇక ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఫ్యామిలీ కథా చిత్రం చేస్తున్నట్లు టాక్ వచ్చినప్పటికీ.. కొరటాల శివతో మూవీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
ఎన్టీఆర్ ఈ స్టెప్ తీసుకోవడంలో ఓ మర్మం దాగుందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. 2018 నుంచి ఎన్నికల వేడి మొదలవుతుంది. అందరూ ఎలక్షన్స్ ఫీవర్ లో ఉంటారు. అందుకు అనుగుణంగా పొలిటికల్ థ్రిల్లర్ కథతో దిగాలని తారక్ డిసైడ్ అయ్యారంట. అందుకే ఓ మెసేజ్ ఓరియెంటెడ్ పొలిటికల్ థ్రిల్లర్ కథకు ఓకే చెప్పినట్లు సమాచారం. అక్టోబర్ లో మొదలై వచ్చే ఏడాది విడుదలకానున్న ఈ సినిమా కచ్చితంగా 2019 ఎన్నికల మీద ప్రభావితం చేసే అవకాశం ఉందని సినిమా, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.