ఎన్టీఆర్ భార్య ప్రణతి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన వార్తల్లో నిజమెంత?
June 5, 2018 / 07:51 AM IST
|Follow Us
“తారక్ రెండో సారి తండ్రి అయ్యారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది”.. అంటూ రెండు రోజులుగా న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నందమూరి అభిమానులు చాలా సంతోషపడి షేర్ల ద్వారా మరింతమంది చేరవేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు అయితే ఈ కారణంగానే ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించడానికి ఒప్పుకోలేదని ప్రచారం చేశాయి. అయితే ఇందులో నిజం లేదని తెలిసింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండే వారిని నెటిజనులు అడిగి తెలుసుకునే వీలుంది. అదే విధంగా ఓ అభిమాని పీఆర్వో మహేష్ కోనేరును ప్రశ్నించారు.
ఎన్టీయార్ గురించి వస్తున్న ఆ వార్త పూర్తిగా అబద్దమని మహేష్ సమాధానం చెప్పారు. ఎన్టీఆర్, ప్రణతిలకు నాలుగేళ్ళ క్రితం ఒక బాబు పుట్టిన సంగతి తెలిసిందే. అతనికి అభయ్ రామ్ అని పేరు పెట్టారు. కొడుకు పుట్టిన తర్వాత ఎన్టీఆర్ చాలా మారిపోయారు. ఇక ప్రణతి రెండో సారి గర్భందాల్చింది. రీసెంట్ గా బయటికివచ్చిన ఫోటోలు ఆ విషయాన్నీ స్పష్టంచేశాయి. అయితే ఆ విషయాన్నీ ఎన్టీఆర్ కుటుంబసభ్యులు అధికారికంగా బయటికి చెప్పలేదు. బహుశా త్వరలోనే ఆ శుభవార్తని వినే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అభయ్ రామ్ కి తమ్ముడు పుట్టబోతున్నాడా? చెల్లెలు పుడుతుందా? అనేది మాత్రం ఎవరూ చెప్పలేము.