టాలీవుడ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ను కొలిచే కొలమానంగా ఉండే నంది అవార్డ్స్ పై ఒకప్పుడు ఉన్న మోజు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. అసలైతే ఆ అవార్డ్స్ అన్నీ ప్రభుత్వాలు తమ తమ అవసరాల కోసం ఇస్తూ ఉంటాయి అని కొందరు స్టార్స్ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ఆ నందిని కాసేపు మనం మరచి పోతే, ఆ నంది ప్లేస్ లో ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి. వాటిల్లో సైమా అవార్డ్స్ ఒకటి. సైమా అంటే…సౌత్ ఇండియన్ ఇంటర్న్యాషనల్ .అవార్డ్స్. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అవార్డ్స్ సైతం ఫేక్ అని తెలిపోయింది. ఈ అవార్డ్స్ సైతం రాజకీయ ప్రలోభాలకు లొంగి పోయాయి అని తెలిసి పోయింది అంటున్నారు యంగ్ టైగర్ అభిమానులు.
విషయం ఏమిటంటే…తాజాగా ప్రకటించిన సైమా అవార్డ్స్ లిస్ట్ లో టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ పేరు లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతం, అమోఘం, అజరామరం, ఇంకా చెప్పాలి అంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో విశ్వరూపం చూపించేసాడు. కానీ అలాంటి పాత్రను ఈ అవార్డ్స్ కు ఎంపిక చెయ్యకపోవడం నిజంగా సైమా చేస్తున్న పెద్ద తప్పు అని ఇట్టే తెలిసిపోతుంది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆన్లైన్ సైట్స్ లో హల్చల్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఈ అవార్డ్స్ కు బెస్ట్ హీరో క్యాటగిరిలో ఎంపికైన సినిమాల్లో కొన్ని చోటా మోటా సినిమాలు కూడా ఉండడంతో ఈ అవార్డ్స్ ఫేక్ అన్న వాదన బలంగా వినిపిస్తుంది. మరి దీనిపై ఇంకా ఎంతటి గొడవ జరుగుతుందో చూడాలి.