షాక్ ఇస్తున్న ‘నువ్వేకావాలి’ హీరోయిన్ రిచా..!

  • January 6, 2022 / 05:45 PM IST

తరుణ్ హీరోగా కె.విజయ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నువ్వేకావాలి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2000వ సంవత్సరంలో అక్టోబర్ 13న విడుదలైన ఈ చిత్రం.. ఆ తరువాత 2001 సమ్మర్ పూర్తయ్యేవరకూ ఆడుతూనే ఉంది. చిరంజీవి,నాగార్జున,బాలకృష్ణ, వెంకటేష్,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైనా… ఈ చిత్రం ఆడుతూనే వచ్చింది. త్రివిక్రమ్ డైలాగ్స్, కోటి సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో నటించిన తరుణ్, సాయి కిరణ్ వంటి అందరికీ మంచి గుర్తింపు లభించింది.

కానీ హీరోయిన్ రిచా పల్లాడ్ కు మాత్రం ఈ చిత్రం పెద్దగా కలిసి రాలేదు అనే చెప్పాలి.మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది.. ఫిలింఫేర్ అవార్డు కూడా కొట్టింది.. కానీ తరువాత..స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది.అంతేకాక చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. ‘నువ్వేకావాలి’ తరువాత తరుణ్ నటించిన ‘చిరుజల్లు’, శ్రీకాంత్ నటించిన ‘నా మానసిస్తారా’, ఉదయ్ కిరణ్ నటించిన ‘హోలీ’.. వంటి చిత్రాలలో నటించే అవకాశం రిచాకు లభించింది కానీ అవన్నీ ప్లాప్ లు అవ్వడంతో ఈమెను పట్టించుకున్న దర్శకనిర్మాతలు లేరు.

ఇక రిచా సొంత ఊరు బెంగుళూరు.తమిళం, హిందీలో కూడా సినిమాలు చేసింది కానీ.. అవి కూడా సక్సెస్ కాలేదు. దీంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి వివాహం చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు ఉన్నాడు. తన ఆలన పాలన చూసుకుంటూ.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది రిచా. ఇక ఈమె ప్రెజెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ ‘నువ్వేకావాలి’ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus