October Month Review: 50 పైగా రిలీజ్ అయితే హిట్ అయినవి ఇవే..!
November 2, 2023 / 04:01 PM IST
|Follow Us
2023 వ సంవత్సరంలోకి ఎంట్రీ ఇచ్చి 10 నెలలు పూర్తయ్యింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పెద్ద సినిమాల సంఖ్య చాలా తక్కువ. అందులో కూడా హిట్ అయినవి లెక్కేస్తే.. అందరికీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అనే చెప్పాలి. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. అక్టోబర్ నెల పూర్తయ్యింది. ఈ నెల బాక్సాఫీస్ ప్రోగ్రెస్ ను కనుక గమనిస్తే.. ! ఈ నెలలో దాదాపు 60 కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. డబ్బింగ్ సినిమాలు వంటివి కూడా కలుపుకుంటే లెక్క 80 వరకు ఉంది.
అక్టోబర్ (October) మొదటి వారంలో ‘మంత్ ఆఫ్ మధు’ ‘మామా మశ్చీంద్ర’ ‘మ్యాడ్’ ‘రూల్స్ రంజన్’ ‘800’ ‘చిన్నా’ ‘ఏందిరా ఈ పంచాయతీ’ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో సక్సెస్ అయ్యింది ‘మ్యాడ్’ ఒక్కటే. మిగిలిన 3 సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ‘800’ అనే సినిమాకి హిట్ టాక్ వచ్చినా మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది అని చెప్పాలి. ఇక రెండో వారం ‘సగిలేటి కథ’ ‘రాక్షస కావ్యం’ ‘గాడ్’ వంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి.
వీటిలో ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఇక దసరా కానుకగా ‘భగవంత్ కేసరి’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘లియో’ ‘గణపధ్’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘గణపధ్’.. పెద్దగా ఆడలేదు మిగిలిన రెండు సినిమాలు బాగానే ఆడాయి. ఇక చివరి వారంలో ‘మార్టిన్ లూథర్ కింగ్’ ‘లింగోచ్చా’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం సత్తా చూపలేకపోయాయి.
మొత్తంగా అక్టోబర్లో ‘మ్యాడ్’ ‘లియో’ ‘భగవంత్ కేసరి’ తప్ప మిగిలిన అన్ని సినిమాలు నిరాశపరిచాయి. హిట్ పర్సెంటేజ్ అనేది కనీసం 10 శాతం కూడా లేకపోవడం గమనార్హం. మరి నవంబర్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. పైగా టాలీవుడ్ కి ఫిబ్రవరి, నవంబర్ .. అన్ సీజన్ అంటుంటారు.