Oh Baby Collections: సమంత ‘ఓ బేబీ’ కి 3 ఏళ్ళు..  ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • July 5, 2022 / 11:39 AM IST

స‌మంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం విడుదలయ్యి నేటితో 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దీంతో సోషల్ మీడియాలో సమంత అభిమానులు సందడి చేస్తున్నారు. నందినీరెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత తన కామెడీతో అలరించడమే కాకుండా, ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించింది. ‘మిస్ గ్రానీ’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ‘ఓ బేబీ’ ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘గురు ఫిలిమ్స్’ ‘క్రాస్ పిక్చర్స్’ సంస్థలు కలిసి నిర్మించాయి. సీనియర్ నటి లక్ష్మీ,రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావు రమేష్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా అతిధి పాత్రలో మెరిసాడు.

మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం :

నైజాం – 4.97 కోట్లు
సీడెడ్ – 1.60 కోట్లు
వైజాగ్ – 1.90 కోట్లు


గుంటూరు – 0.84 కోట్లు
ఈస్ట్ – 0.80 కోట్లు
వెస్ట్ – 0.70 కోట్లు


కృష్ణా – 1.05 కోట్లు
నెల్లూరు – 0.40 కోట్లు
———————————–
ఏపీ+తెలంగాణ = 12.26 కోట్లు (షేర్)

రెస్టాఫ్ ఇండియా – 1.95 కోట్లు
ఓవర్సీస్ – 3.90 కోట్లు
————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ టోటల్ = 18.11 కోట్లు (షేర్)
————————————–

‘ఓ బేబీ’ చిత్రం థియేట్రికల్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాయి. ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం 18.11 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. సమంత ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినిమా కొన్న ప్రతీ డిస్ట్రిబ్యూటర్ కు లాభాలు వచ్చాయి. ఈ చిత్రంతో సమంత స్టార్ డం ఏంటనేది మరోసారి ప్రూవ్ అయ్యింది. అలాగే ‘అలా మొదలైంది’ తర్వాత సక్సెస్ మొహం చూడని నందినీ రెడ్డి కూడా ఈ చిత్రంతో ‘బౌన్స్ బ్యాక్’ అయ్యిందనే చెప్పాలి.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus