రీ రిలీజ్ సినిమాల హడావిడి మహేష్ బాబు ‘పోకిరి’ తో మొదలైంది. పాత ప్రింట్ ను 4K కి డిజిటలైజ్ చేసి మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఒక్కరోజు ప్రదర్శితమైనప్పటికీ మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న తరుణంలో జనవరి 7న(నిన్న) ఆ చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేశారు. అయితే ఇటీవల రీ రిలీజ్ అయిన ‘ఖుషి’ చిత్రానికి చేసిన ప్రమోషన్ ‘ఒక్కడు’ రీ రిలీజ్ కు చేయలేదు.
అందుకే ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు కొట్టలేదు కానీ.. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ నే సాధించింది ‘ఒక్కడు’ మూవీ..! ‘ఒక్కడు'(4K) ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.57 cr |
సీడెడ్ | 0.14 cr |
ఆంధ్ర | 0.49 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.20 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.09 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.29 cr |
‘ఒక్కడు'(4K) రీ రిలీజ్ లో మొదటి రోజు రూ.1.29 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ మార్క్ అయితే రూ.2 కోట్లు దాటినట్టు సమాచారం. సో బుకింగ్స్ బాగానే ఉన్నాయి. కానీ రికార్డులు మాత్రం కొట్టలేకపోయింది.
మరో వారం రోజుల్లో సంక్రాంతి సినిమాలు ఉండటం వల్ల ‘ఒక్కడు’ రీ రిలీజ్ లో రికార్డులు కొట్టలేకపోయింది అని చెప్పొచ్చు. అయితే రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఇది మూడో హైయెస్ట్ అని చెప్పొచ్చు. ఆదివారం కూడా ‘ఒక్కడు’ అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?