Actress: కథ డిమాండ్ చేస్తే అలా నటించడానికి వెనుకాడను!

  • April 27, 2023 / 12:08 PM IST

అమలాపాల్ ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ‘బెజవాడ’ ‘లవ్ ఫెయిల్యూర్’ ‘నాయక్’ ‘ఇద్దరమ్మాయిలతో’ ‘జెండా పై కపిరాజు’ ‘పిట్ట కథలు'(వెబ్ సిరీస్) వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. కానీ అవి సక్సెస్ కాకపోవడంతో ఎక్కువగా మలయాళం, తమిళ భాషల సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది. బోల్డ్ నెస్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ గా అమలా పాల్ ను చెప్పుకోవచ్చు. ఈమె పోషించే పాత్రలు అలా ఉంటాయనే ఉద్దేశంతో మాత్రమే ఈ మాట చెప్పడం లేదు.

ఈమె (Actress) పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు, ఈమె చేసే కామెంట్లను బట్టి ఇది చెప్పొచ్చు. ‘ఆడై’ అనే సినిమాలో ఈమె వంటి పై నూలుపోగు లేకుండా నటించి సంచలనం సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ కాకూడదు అంటూ మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. తెలుగులో ఈ చిత్రం ‘ఆమె’ పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి అమలా పాల్ డబ్బు పెట్టడం కూడా జరిగింది. కానీ సినిమా ప్లాప్ అవ్వడంతో భారీగా నష్టపోయింది.

అయినా సరే అలాంటి ప్రయత్నాలకు తగ్గేదే లేదు అంటూ చెప్పుకొస్తుంది ఈ బ్యూటీ. ఈమె పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన ‘ఆడుజీవితం’ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీలో లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. ఈ విషయం పై అమలా పాల్ స్పందిస్తూ.. ” ‘ఆడు జీవితం’ స్టోరీ వినిపించే సమయంలోనే ఆ సన్నివేశం ఉంటుందని దర్శకుడు ముందుగానే చెప్పాడు. అందుకు నేను ముందుగానే అంగీకరించాను.

పైగా ఆ సన్నివేశం లిప్ లాక్ చేస్తేనే పండుతుంది. అందుకే అలా నటించాను. నా వరకు కథ డిమాండ్ చేస్తే బట్టలు విప్పేసి నటించేందుకు ఎప్పుడూ సిద్దమే. గతంలో కూడా బట్టలు లేకుండా నటించాను. కాబట్టి ఈ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశంలో నటించడం పెద్ద విషయంగా ఏమీ అనిపించలేదు” అంటూ చెప్పుకొచ్చింది అమలా పాల్. ఆమె కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై నెటిజెన్ల సెటైర్లు కూడా విసురుతున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus