లైవ్ లో నెటిజెన్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన అనసూయ..!
May 16, 2020 / 12:19 PM IST
|Follow Us
నిన్న అనసూయ పుట్టిన రోజు కాబట్టి.. తనకి బర్త్ డే విషెస్ చెప్పిన వారందరికీ థాంక్స్ చెప్పడానికి అలాగే వారితో ముచ్చటించాడు లైవ్ లోకి వచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజెన్ ‘డ్రెస్ సరిగ్గా వేసుకోవడం నేర్చుకో… నువ్వు ఒక అమ్మ అనే సంగతి గుర్తుపెట్టుకో’ అంటూ విమర్శించాడు. దీంతో అనసూయకు ఓ రేంజ్ లో కోపం వచ్చింది. ఆ నెటిజెన్ పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది. అనసూయ మాట్లాడుతూ.. “నువ్వెవడ్రా నాకు చెప్పడానికి…! అమ్మంటే తెలుసా నీకు…? తన పిల్లలను బాధ్యతగా చూసుకుంటూ తన బాధ్యతను కూడా గుర్తుచేసుకునేది అమ్మ.
అమ్మతనం అనేది బట్టల్లో కాదు చూడాల్సింది. నా అందం కోసం నేను నాకు నచ్చిన బట్టలు వేసుకుంటా” అంటూ చెప్పుకొచ్చింది.’ఇలాంటి చెత్త కామెంట్లు చేసేవాళ్ళు కీ బోర్డు మాత్రమే కొడతారు. ఎదురుగా కామెంట్ చేసే దమ్ము ఉండదు. ఇలాంటి వాళ్ళ కోసం మాట్లాడి టైం వేస్ట్ చెయ్యడం ఎందుకు’… అంటూ ఓ సెటైర్ కూడా వేసింది. ఇలా లైవ్ లో .. అనసూయ పై నెగిటివ్ కామెంట్లు చెయ్యడం వారి పై ఫైర్ అవ్వడం వంటివి కొత్తేమీ కాదు.
గతంలో క్కూడా ఎన్నో సార్లు ఇలా అనసూయను విమర్శించారు. అనసూయ బుల్లితెర క్రేజ్ అలాంటిది కాబట్టి .. ఇలాంటి కామెంట్స్ సర్వ సాధారణం అని మాత్రం అనుకోదు. ఇలా రియాక్ట్ అవుతుంది కదా అని భావించి ఈమెను రెచ్చకొట్టేవారు కూడా ఎక్కువే.