Pushpa Movie: క్రేజీ మూవీ హాల్ట్‌కి ఈసారి కెప్టెనే కారణమట!

  • July 23, 2021 / 02:22 PM IST

టాలీవుడ్‌లో చాలా సినిమాల ఇప్పుడు హోల్డ్‌ దశలో ఉన్నాయి. కరోనా – లాక్‌డౌన్‌ పుణ్యమా అని సినిమా చిత్రీకరణలు ఎక్కవక్కడ ఆగిపోయాయి. వాటిలో కొన్ని సినిమాల చిత్రీకరణలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వాటిలో ‘పుష్ప’ సినిమా కూడా ఒకటి. కాస్ట్‌ అండ్‌ క్రూలో చాలామంది కరోనా సోకడంతో సినిమా చిత్రీకరణ అలా ప్రారంభించడం, ఇలా ఆపేయడం లాంటివి కంటిన్యూగా జరిగాయి. ఇటీవల సినిమా చిత్రీకరణ మొదలైంది.‘పుష్ప’ షూటింగ్‌ మొదలుపెట్టాం అంటూ ఇటీవల చిత్రబృందం ఘనంగా పోస్టర్‌ను విడుదల చేసి మరీ చెప్పింది.

అయితే ఇప్పుడు చిత్రీకరణ జరగడం లేదట. కారణం సుకుమార్‌ అనే అంటున్నాయి సినిమా సన్నిహిత వర్గాలు. సుకుమార్‌ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని, అందుకే సినిమా చిత్రీకరణకు మళ్లీ బ్రేక్‌ వేశారని టాక్‌. అయితే దీనిపై సుక్కు టీమ్‌ నుండి ఎలాంటి సమాచారం లేదు. ‘పుష్ప’ను రెండు పార్టులుగా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. దీంతో వీలైనంత త్వరగా తొలి పార్టు పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ఆలోచిస్తోంది.

అందుకే చిత్రీకరణను ఇటీవల ప్రారంభించారు కూడా. అయితే ఇప్పుడు కెప్టెన్‌ సుకుమార్‌ వల్ల సినిమా ఆగింది. మరోవైపు థర్డ్‌ వేవ్‌ వస్తోందని వార్తలొస్తున్నాయి. దీంతో చిత్రీకరణ ఏమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus