నిర్మాణ రంగంతోపాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తల పండిపోయిన మేధావుల్లో దిల్ రాజు ఒకరు. ఆయన ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొన్నాడూ అనే వార్త తెలిసిందంటే చాలు సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోయేవారు జనాలు. అడపాదడపా పెద్ద సినిమాలు ఏవో ఫ్లాప్ అవ్వడం తప్ప దిల్ రాజు కెరీర్ లో మొన్నటివరకూ పెద్దగా ఫ్లాప్స్ లేవు. కానీ.. గత కొంత కాలంగా దిల్ రాజు వరుస పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. సంక్రాంతి రిలీజ్ లు “సరిలేరు నీకెవ్వరు”తో నిర్మాణ భాగస్వామిగా, “అల వైకుంఠపురములో”తో డిస్ట్రిబ్యూటర్ గా భారీ విజయాలు అందుకున్న దిల్ రాజు అదే ఊపులో “జాను” చిత్రాన్ని విడుదల చేశాడు.
తమిళంలో కల్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ కంటే డబ్బింగ్ బెటర్ అని ఎంతమంది చెప్పినా వినకుండా “జాను” అని రీమేక్ చేసి విడుదల చేశాడు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాకపోయినా రివ్యూలు, పాజిటివ్ టాక్ చూసి సినిమా సూపర్ హిట్ అయిపోతుంది అనుకున్నారు జనాలు, విశ్లేషకులు. కానీ.. సినిమా సోమవారం నుంచే కలెక్షన్స్ కి మొహం వాచిపోయింది. థియేటర్ కి వచ్చే నాధుడే లేకుండాపోయాడు. అందులోనూ సినిమాలో అమేజాన్ ప్రైమ్ లోగో పడేసరికి హ్యాపీగా ఇంట్లో చూసుకోవచ్చులే అని జనాలు థియేటర్లలో జాను చిత్రాన్ని చూడడానికి పెద్ద ఆసక్తి చూపలేదు. దాంతో.. నిర్మాతగా దిల్ రాజు భారీ మొత్తంలో నష్టపోయాడు. అయితే.. సంక్రాంతికి వచ్చిన లాభాలతో పోల్చినప్పుడు ఇది పెద్ద నష్టం కాకపోయినా.. ఒక నిర్మాతగా ఆయన డెసిషన్ మేకింగ్ మరోసారి ఫెయిల్ అయ్యింది.
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!