మరోసారి పోలీస్ పవర్ చూపిస్తానంటున్న రవితేజ

  • October 2, 2019 / 04:06 PM IST

మాస్ మహా రాజ్ రవితేజ కి 2018 వ సంత్సరం నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఈ సంవత్సరం వచ్చిన రవితేజ సినిమాలు ‘టచ్ చేసి చూడు’ ‘నేల టికెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి.కెరీర్లో ఎన్నడూ లేని విధంగా రవితేజకి హ్యాట్రిక్ డిజాస్టర్లు పడ్డాయి. రవితేజ ప్రస్తుతం మంచి హిట్టివ్వడానికి చాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా దర్శకుడు వీఐ ఆనంద్ చెప్పిన కథను ఓకే చేసాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న “డిస్కో రాజా” డిసెంబర్ విడుదలకు రెడీ అవుతుండగా.. తనకు “డాన్ శీను, బలుపు” లాంటి మాస్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు రవితేజ.

తాజా సమాచారం మేరకు రవితేజ ఈ కొత్త సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. రవితేజ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలవ్వనుంది. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ సినిమా సైన్ చేశాడు రవితేజ. 2020లో తన సినిమాలు కనీసం రెండు విడుదలవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు మాస్ మహారాజా.

‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus