తమిళనాడు లోని ఆర్కేనగర్ ఉప ఎన్నిక అనేక రాజకీయ పరిణామాలకు దారితీస్తున్నాయి. ఆర్కేనగర్‌లో అన్నాడీఎంకే నేతలు కోట్లు పంచారని డీఎంకే నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అన్నాడీఎంకే వారికి మద్దతు తెలిపిన మంత్రులు, ఎంఎల్ఏలు, వ్యాపారవేత్తలు చిక్కుల్లో పడుతున్నారు. ఈ జాబితాలో ప్రముఖ నటులు రాధిక, శరత్ కుమార్ కూడా ఉన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో బరిలో ఉన్న దినకరన్ కు శరత్ కుమార్ మద్దతు ఇవ్వడంతో అతనిపై ఐటీ అధికారుల నిఘా పడింది. మొన్న శరత్‌కుమార్ ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.
నిన్న రాధికా, శరత్‌కుమార్‌కు చెందిన రాడన్ గ్రూప్ కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా పలు కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఐటీ శాఖ విచారణకు శరత్ కుమార్‌తో పాటు రాధిక కూడా హాజరు కానున్నారు. రాడన్ కంపెనీ నుంచి డబ్బు మరల్చినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకు తగిన ఆధారాలు దొరికాయని రాధిక, శరత్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అధికారులతో విచారణ ముగిసిన తర్వాత వారిద్దరూ జైలు కు వెళ్లే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తున్నాయని తమిళ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.