Hero Nani: థియేట్రికల్ నుండి 30 శాతం వస్తే సరిపోతుందట.. మరోసారి పెద్ద చర్చకు దారి తీసిన నాని కామెంట్స్!
April 4, 2023 / 01:05 PM IST
|Follow Us
నేచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడినా అది సెన్సేషన్ అయిపోతుంది. నిజానికి నాని మాట్లాడేది కరెక్ట్ గానే ఉంటుంది కానీ.. ఎందుకో అవి మిస్ ఫైర్ అవుతుంటాయి. నాని సాఫ్ట్ కార్నర్ కాబట్టి… ఓ వర్గం ప్రేక్షకులు వెంటనే అతన్ని టార్గెట్ చేస్తుంటారు. ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో నాని ‘చరణ్ మొదటి సినిమాని కోటి మంది చూశారు.. నాని మొదటి సినిమాని లక్ష మంది చూశారు. ఇక్కడ నెపోటిజంని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు.
ప్రేక్షకులే కదా.. మీకు ఏం కావాలో ఇక్కడ అదే ఇస్తుంటారు’ అని అన్నాడు. నిజానికి నాని చెప్పింది వందకు వంద శాతం నిజం. కానీ నానిని ఘోరంగా విమర్శించారు. స్టార్ ఫ్యామిలీ నుండి ఎవరైనా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు అంటే జనాలు ఎగబడి చూస్తుంటారు. వాళ్ళ సినిమా సరిగ్గా ఆడకపోతే రెండో ఛాన్స్ మూడో ఛాన్స్ కూడా ఇస్తుంటారు. అప్పటికీ ప్రూవ్ చేసుకోకపోతే పక్కన పెట్టేస్తారు. అదే కొత్త వాళ్ళను అయితే మొదటి సినిమాకే పక్కన పెట్టేస్తారు.
సరే తాజాగా నాని(Nani) చేసిన ఇంకో హాట్ కామెంట్స్ ఏంటో చూద్దాం. ‘దసరా’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడుతుంది. కానీ మిగిలిన భాషల్లో అంతగా ఆడటం లేదు. ‘దసరా’ కి రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టారు అన్నది నిర్మాతల మాట. అంత రికవర్ కాలేదు అని కొంతమంది అంటున్నారు. దీనికి నాని ‘నా సినిమాకి నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 70 శాతం రికవర్ అయిపోతుంది.
థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు రావాల్సింది 30 శాతమే.’ అని అన్నాడు. బడ్జెట్ కి .. బిజినెస్ కి కంపేర్ చేస్తే నాని చెప్పింది వందకు వంద శాతం నిజం. కానీ ఈ కామెంట్స్ ను వేరే విధంగా తీసుకున్న కొంతమంది జనాలు ‘మరి డిస్ట్రిబ్యూటర్స్ సంగతి ఏంటి? నీ సినిమాకి బిజినెస్ నీ మార్కెట్ ను బట్టి జరుగుతుంది కదా’ అంటున్నారు.