Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ తో రతిక ఆటలు..! ఫైర్ అవుతున్న ఆడియన్స్ .. కారణం ఇదే..

  • September 19, 2023 / 10:24 AM IST

బిగ్ బాస్ హౌస్ లో మరోసారి పల్లవి ప్రశాంత్ రతికల చేష్టలు వైరల్ గా మారాయి. బెడ్ రూమ్ లో మిర్రర్ కి అటువైపు రతిక బెడ్ పై బోర్లా పడుకుని పల్లవి ప్రసాంత్ ని కవ్వించసాగింది. దీంతో మనోడు కూడా పాత విషయాలు అన్నీ మర్చిపోయి పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మిర్రర్ కి దగ్గరగా ఉన్న రతికని ఇంకొంచెం ముందుకు రా అంటూ ఒక డైలాగ్ వేశాడు పల్లవి ప్రసాంత్. అలా వస్తే తన బుగ్గలు తన మూతికి తలుగుతాయని మెలికలు తిరిగిపోయాడు. హా.. ఏంటి అని అడిగితే ఏం లేదు అంటూ అక్కడే పడుకుని సిగ్గుపడిపోయాడు ప్రసాంత్.

అంతేకాదు, తన బెడ్ దగ్గరకి వెళ్లిపో అంటే, నేను ఇక్కడే పడుకుంటా అంటూ అక్కడే ఆమెతో ముచ్చట్లు పెట్టసాగాడు. అంతేకాదు, ఇద్దరూ చేతులని తాకించుకుంటూ స్నేక్ గేమ్ ఆడారు. మిర్రర్ మద్యలో ఇద్దరూ ఆటలు చూసిన హౌస్ మేట్స్ వీళ్లు మళ్లీ మొదలెట్టేశారంటూ మాట్లాడాడుకున్నారు. అంతేకాదు, ఈసారి ఇది కొద్దిగా సీరియస్ ఇష్యూ అయ్యేలాగానే కనిపిస్తోంది. అయితే, ఇక్కడే రతిక చాలా ముందు చూపుతో చేసిందని ఆడియన్స్ ఫైర్ అయిపోతున్నారు.

అంతకుముందు ప్రిన్స్ యావార్ పల్లవి ప్రశాంత్ ఇద్దరూ రతిక గురించి మాట్లాడుకున్నారు. ఈ ముగ్గురూ బాల్కనీలో కూర్చుని క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చుకున్నారు. అయితే, ఇప్పుడు పల్లవి ప్రసాంత్ తో రతిక మళ్లీ గేమ్ మొదలెట్టిందని ఆడియన్స్ ఫైర్ అయిపోతున్నారు. ఇప్పుడు వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు, ఈ బిట్ ని సపరేట్ గా అన్ కట్స్ అంటూ స్టార్ మాటివిలో టెలికాస్ట్ కూడా చేసేసరికి ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యింది.

ప్రస్తుతం రతిక నామినేషన్స్ లో ఉంది. ఈవారం డేంజర్ జోన్ లో తప్పకుండా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, పల్లవి ప్రశాంత్ ఈవారం నామినేషన్స్ నుంచీ బయటపడ్డాడు. కేవలం టేస్టీ తేజ ఒక్కడే పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. మిగతా హౌస్మేట్స్ ఎవ్వరూ కూడా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేయలేదు. మరి ఈవారం వీరిద్దరి ట్రాక్ ఎంతదూరం వెళ్తుందనేది చూడాలి.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus