Posani Krishna Murali: నంది అవార్డుల పై పోసాని కృష్ణమురళి షాకింగ్ కామెంట్స్
July 5, 2023 / 11:11 AM IST
|Follow Us
నంది అవార్డులని టాలీవుడ్ నటీనటులు, ప్రేక్షకులు ప్రెస్టీజియస్ ఆవార్డులుగా భావిస్తుంటారు.వీటి గురించి కొంతకాలంగా ఎక్కువ చర్చ నడుస్తోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నంది అవార్డుల గురించి ఆలోచించడం లేదు. పలువురు సినీ ప్రముఖులు నంది అవార్డులు … ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు జరిపినా ఉపయోగం లేకుండా పోయింది. దాదాపు ఆరేళ్ళ నుండి తెలుగు సినిమాలకి, నటీనటులకి నంది అవార్డులు ఇవ్వడం లేదు. అందుకే వీటి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
రోజులు గడుస్తున్నా కొద్దీ ఇదొక కామన్ న్యూస్ లా అయిపోయింది. ఈ నేపథ్యంలో నటుడు, ఏపీ ఫిలిం అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన (Posani Krishna Murali) పోసాని కృష్ణ మురళి.. నంది అవార్డుల పై చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. పోసాని మాట్లాడుతూ.. ” నంది నాటక అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల రెండేళ్లు, తర్వాత వేరే పనుల వల్ల ఇంకో రెండేళ్లు అవార్డులు ఇవ్వలేదు.
సినిమా, టీవీ కార్యక్రమాలకు ఇప్పట్లో నంది అవార్డులు ఇవ్వలేమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. పద్యనాటకాలు మన ప్రాంతానికే ప్రత్యేకం అందుకే వాటికి నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ వర్గానికి ఈ వర్గానికి అనే బేధం లేకుండా అర్హులకు మాత్రమే అవార్డులు ఇవ్వాలన్నది మా లక్ష్యం. అర్హులైన వారికి నంది అవార్డులు ఇవ్వలేదని నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను.
100 సినిమాలకు కథలు రాసినప్పటికీ నాకు ఒక్క నంది అవార్డు కూడా రాలేదు. కనీసం 10-15 సినిమాలకు నంది అవార్డు వస్తుందని ఆశించాను. నాపై కోపంతోనే కొందరు నన్ను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా షూటింగ్లు చేసుకోవచ్చు. అక్కడ స్టూడియోలు పెట్టుకోవడానికి, సినీ పరిశ్రమ అభివృద్ధికి .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకరిస్తారు” అంటూ పోసాని చెప్పుకొచ్చారు.