Prabhas Remuneration: మరోసారి రెమ్యునరేషన్ డోస్ పెంచిన ప్రభాస్!
October 13, 2021 / 02:17 PM IST
|Follow Us
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ వరుసగా పాన్-ఇండియన్ చిత్రాల బలమైన లైనప్‌తో అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రీకరణ పూర్తయింది. ఇక వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K మరియు స్పిరిట్ సినిమాలు కూడా వరుసలో ఉన్నాయి. మరికొన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుత ప్రాజెక్టులన్నింటికీ 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నాడు.
అయితే అతను స్పిరిట్ కోసం మాత్రం 150 కోట్లకు పైగా డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక మేకర్స్ ప్రభాస్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించారని తెలుస్తోంది. ఇక భవిష్యత్ ప్రాజెక్ట్‌లన్నింటి కోసం, ప్రభాస్ 150 కోట్లు వరకు తీసుకునే అవకాశం ఉందట. ఇక లైన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్ అలాగే యువి క్రియేషన్స్ వంటి నిర్మాణ సంస్థలతో కూడా చర్చలు జరుపుతున్నారు. అతను ఈ సంవత్సరమే మరో రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉంది.
సిద్ధార్థ్ ఆనంద్ మరియు ప్రశాంత్ నీల్‌తో కూడా చర్చలు జరుపుతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఇక ఆ తరువాత వెంటవెంటనే మరో రెండు సినిమాలను 2023లో విడుదల చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నట్లు సమాచారం.