Rajamouli: అదే తప్పు మళ్లీమళ్లీ చేస్తున్న రాజమౌళి..?
May 27, 2021 / 02:46 PM IST
|Follow Us
స్టార్ డైరెక్టర్ రాజమౌళి మగధీర, బాహుబలి సిరీస్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించి పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అగ్ర హీరోలంతా రాజమౌళితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రాజమౌళి సినిమాలో నటిస్తే ఆయా హీరోల మార్కెట్ భారీగా పెరగడంతో పాటు ప్రేక్షకుల్లో గుర్తింపు పెరుగుతుంది. మన దేశ సినిమా గొప్పదనాన్ని అమాంతం పెంచిన దర్శకునిగా రాజమౌళికి పేరుంది. కానీ ఈ డైరెక్టర్ ప్రేక్షకుల నుంచి ఒక విమర్శను మాత్రం ఎదుర్కొంటున్నారు.
కెరీర్ తొలినాళ్లలో వేగంగా సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి గత కొన్నేళ్ల నుంచి ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకే మూడున్నరేళ్లు పరిమితం కావడం గమనార్హం. ప్రతిభ పుష్కలంగా ఉన్న రాజమౌళి లాంటి డైరెక్టర్లు వేగంగా సినిమాలను తెరకెక్కిస్తే సినిమా ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. జక్కన్న సరైన ప్రణాళికతో వేగంగా సినిమాలు తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. రాజమౌళి ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగేళ్ల సమయం కేటాయిస్తే ఆయన సినిమాల్లో నటించిన హీరోల కెరీర్ కు ఒక విధంగా నష్టం జరుగుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
రాజమౌళి తనపై వ్యక్తమవుతున్న ఈ విమర్శలను చెరిపోసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాతైనా రాజమౌళి వేగంగా సినిమాలు తెరకెక్కిస్తారేమో చూడాల్సి ఉంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ శాటిలైట్, డిజిటల్ హక్కుల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేసి పాన్ ఇండియా సినిమాకు అసలైన అర్థం చెబుతుండటం గమనార్హం. శాటిలైట్, డిజిటల్ హక్కులతో ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన రికార్డులను ఏ సినిమా బీట్ చేస్తుందో చూడాల్సి ఉంది.