రియల్ మెన్ ఛాలెంజ్ లో రియల్ గా గెలింది సంపూర్ణేష్ బాబే
April 24, 2020 / 08:16 PM IST
|Follow Us
సంపూర్ణేష్ బాబు జీవితం ఓ సంచలనం. హీరో అవ్వాలంటే ఆరడుగుల హైట్, సిక్స్ ప్యాక్ బాడీ తెల్లని శరీరం అందమైన రూపం ఉండాలి అనేది కేవలం అపోహ మాత్రమే అని నిరూపించిన సామాన్యుడు. సంపూర్ణేష్ బాబుదగ్గర ఇవేమి లేవు కేవలం హీరో అవ్వాలనే తపన తప్ప. కటిక పేదవాడైన సంపూర్ణేష్ స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం తిరుగుతుంటే ఓ రోజు… నా సినిమాకు ఓ వరస్ట్ హీరో కావలి అది నువ్వే అనుకుంటున్నాను చేస్తావా అన్నాడట హృదయ కాలేయం డైరెక్టర్ సాయి రాజేష్. అల వరస్ట్ హీరోగా పరిచయమై బెస్ట్ అనిపించుకున్నాడు.
హృదయ కాలేయం సినిమా విడుదల తరువాత కొందరు సంపూర్ణేష్ బాబు పై హోటల్ లో దాడిచేశారు. దానికి కారణం సంపూర్ణేష్ హీరోగా చేయడమే. ఇక సంపూర్ణేష్ గత చిత్రం కొబ్బరి మట్ట సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు వచ్చిన ఐదు పది లక్షలు సంపూర్ణేష్ ఆ దానం ఈ దానం అంటూ ఇచ్చిన వాటికే సరిపోయి ఉంటాయి. కర్ణాటకలో ఓ విపత్తు వస్తే సంపూర్ణేష్ విరాళం పంపించారు. సాహో సినిమా ప్రొమోషన్స్ కి బెంగుళూరు వెళ్లిన ప్రభాస్ ని… సంపూర్ణేష్ బాబు సాయం చేశాడు ఇంత పెద్ద స్టార్ అయ్యి మీరు ఒక్క రూపాయి ఇవ్వలేదని అడిగితే ఆయన సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా క్రైసిస్ ఛారిటీ కి కూడా సంపూర్ణేష్ బాబు ఒక లక్ష రూపాయలు దానం ఇచ్చారు. ఆయనకు భవిష్యత్తులో సినిమాలు వస్తాయో రావో తెలియదు. డబ్బులు సంపాదించ గలడని నమ్మకం లేదు. అయినా తన దగ్గర ఉన్న ఆ కొంత సొమ్ము కుటుంబం గురించి కూడా ఆలోచించ కూడా దానం చేసేస్తున్నాను .
ఇక టాలీవుడ్ స్టార్స్ అందరూ రియల్ మెన్ ఛాలెంజ్ అంటూ మొక్కుబడి వీడియోలు పెట్టి వారేదో మహిళా సాధికారత కోసం పాటు పడుతున్నట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారు. ఐతే సంపూర్ణేష్ బాబు తన భార్య పిల్లలకు స్వచ్ఛమైన మనసుతో తన సొంత వృతి అయిన కంశాలిగా మారి భార్య పిల్లలకు కాళ్ళ పట్టీలు చేసి ఇచ్చారు. దానితో పాటు ”రాజు పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు.. నీ వెనక రావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు, గుర్తు చేసుకుంటున్న సమయం ఇది. మా ఆవిడ కోసం, పిల్లల కోసం నా పాత “కంశాలి”వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను’ అని సంపూ పేర్కొన్నాడు. ఇలా రియల్ మెన్ ఛాలెంజ్ రియల్ గా చేసిన రియల్ హీరోగా సంపూర్ణేష్ మిగిలాడు.