ఖానూన్ కా హాత్ లంబాహై అనే డైలాగ్ ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 80లలో బాగా పాపులర్ అయిన ఆ బాలీవుడ్ డైలాగ్ కి అర్ధం బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన సోనమ్ కపూర్ కి ఇప్పుడు అర్ధమవుతోంది. ఇంతకీ మేటర్ ఏంట్రా అంటే.. ఇటీవల సోనమ్ కపూర్ తన కొత్త హీరో దుల్కర్ సల్మాన్ తో షూటింగ్ టైమ్ లో చేసిన ఓ అల్లరి పని ఆమెను ముప్పుతిప్పలు పెట్టింది. దుల్కర్ తో ఓ కార్ సీన్ లో నటిస్తూ ఆ సీన్ లో దుల్కర్ కారు నడుపుతుండగా ఒక ఫోటో తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆ ఫోటోను ముంబై ట్రాఫిక్ పోలీస్ తమ సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేసి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని క్యాప్షన్ పెట్టింది.
దాంతో వెంటనే స్పందించిన సోనమ్ ఆ ఫోటో షూటింగ్ లోది అని చెప్పినప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకపోయింది. అనవసరంగా వైరల్ అయ్యింది. పాపం దుల్కర్ కూడా చెబుతున్నప్పటికీ ఆ సోషల్ మీడియా ఎడ్మిన్స్ కేర్ చేయలేదు. దాంతో సోనమ్ తన రిలేషన్స్ మరియు పరపతి వాడి డైరెక్ట్ గా ట్రాఫిక్ కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చిందట. ఒక్కోసారి సెలబ్రిటీలకు కూడా పోలీసుల నుంచి తిప్పలు తప్పవు అని అర్ధమవుతోంది కదూ.