ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై గురువారం సాయంత్రం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. “ఆగస్టు 5న తిరు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఎంజీఎం హెల్త్ కేర్ లో జాయిన్ అయ్యారు. అప్పటినుండి ఎక్మో, వెంటిలేటర్, లైఫ్ సపోర్ట్ ద్వారా ఆయనకు చికిత్స అందిస్తున్నాము. గత 24 గంటలుగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆందోళనకరంగా ఉండటంతో మరింత లైఫ్ సపోర్ట్ అందిస్తున్నాము.
ఎంజీఎం హెల్త్ కేర్ లోని అనుభవజ్ఞులైన వైద్యుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తోంది” అని హెల్త్ బులిటెన్ లో ఎంజీఎం హెల్త్ కేర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ భాస్కరన్ పేర్కొన్నారు. కరోనా సోకడంతో ఆగస్టు 5న ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఎస్పీబీ… తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఆ తరువాత ఒకానొక దశలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలు రావడంతో త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు, ఎస్పీ బాలు అభిమానులు ప్రార్థనలు చేశారు.
ఆ తరువాత తన తండ్రి ఆరోగ్య పరిస్థితి మెరుగు అయిందని త్వరలో శుభవార్త వింటారు అని ఎస్పీ చరణ్ పేర్కొనడంతో అభిమానులు సంతోషించారు. కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పటికీ వెంటిలేటర్ ద్వారానే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల వ్యాయామం కూడా చేస్తున్నారని చరణ్ చెప్పారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకోవాలన్న ఆసక్తితో ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి ప్రమాదంగా ఉందని ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో అభిమానుల్లో మరోసారి ఆందోళన మొదలైంది.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!