అరవింద సమేత గురించి ట్వీట్ వేయలేదంటూ కోప్పడుతున్నారు!
November 10, 2018 / 01:13 PM IST
|Follow Us
“భరత్ అనే నేను” బహిరంగ సభలో ఎన్టీఆర్ ను మహేష్ బాబు స్వయంగా తమ్ముడు అని పిలిచినా.. ఎన్టీఆర్ కూడా మహేష్ ను “అన్న” అని సంభోదించినా కూడా వారి అభిమానుల నడుమ మాత్రం గొడవలు ఏమాత్రం తగ్గలేదు. పైగా.. ఇంకాస్త పెరిగాయనే చెప్పాలి. మొన్నామధ్య ఎన్టీఆర్ పెట్టిన బర్త్ డే విషెస్ ట్వీట్ కి మహేష్ రిప్లై ఇవ్వలేదన్న కారణంగా.. మహేష్ బాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
ఇప్పుడు ఆ గొడవను మర్చిపోయేలోపే మరో రచ్చ మొదలెట్టారు ఎన్టీఆర్ అభిమానులు. పాపం మొన్న విడుదలైన “సర్కార్” సినిమా బాగుందని మహేష్ ట్వీట్ వేయడం ఆయన్ని ఇరుకున పడేసింది. యావరేజ్ సినిమా అయిన సర్కార్ గురించి ట్వీట్ వేయడానికి ఖాళీ ఉంది కానీ.. సూపర్ హిట్ అయిన “అరవింద సమేత” గురించి ట్వీట్ వేయడానికి మాత్రం ఖాళీ లేదా అని తిట్టడం మొదలెట్టారు.