Merlapaka Gandhi: మేర్లపాక గాంధీ ఈసారి ఏ పాయింట్ పట్టా!
June 4, 2021 / 01:35 PM IST
|Follow Us
సమాజంలో చర్చించడానికే పెద్దవాళ్లు ఆస్తక్తిచూపించిన పాయింట్లను సినిమాల్లో చూపించడం అంటే డేర్ స్టెప్ అనే చెప్పాలి. ఇటీవల ఇలాంటి ఫీట్‌ను యూవీ క్రియేషన్స్, మేర్లపాక గాంధీ చేసి చూపించారు. ‘ఏక్ మినీ కథ’ పేరుతో సైజ్ మేటర్స్ కాదు అంటూ బోల్డ్ పాయింట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కరోనా పరిస్థితుల వల్ల ఆ సినిమా ఓటీటీలో విడుదలై బాగుంది అనిపించుకుంది. ఈ సినిమా ఫలితం ఇచ్చిన జోషల్‌లో యూవీ టీమ్ మరో బోల్డ్ పాయింట్‌ను ఎంచుకుంటోందట.
మేర్లపాక గాంధీ అంటే ఎంటర్టైన్మెంట్ స్క్రిప్టులు రాస్తుంటారు. ఇప్పటివరకు ఆయన చేసిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అలాంటివే. వీటితో ‘ఏక్ మినీ కథ’ను పోల్చలేం. ఎందుకంటే ఇందులో చర్చించుకోదగ్గ పాయింట్ ఉంది. అది ఆయన గత సినిమాల్లో లేదు. ఇప్పుడు మరోసారి మేర్లపాక అలాంటి పాయింట్‌ను పట్టుకున్నారట. ఇప్పటికే దానికి సంబంధించి యూవీ క్రియేషన్స్ దగ్గర ఓకే కూడా అనిపించుకున్నారు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. మేర్లపాక టీమ్‌లో మరో కొత్త కుర్రాడు ఈ బోల్డ్ సినిమాను టేకిల్ చేస్తాడని తెలుస్తోంది.
మరి ఈ సినిమాలో ఎంచుకున్న పాయింట్ ఏంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలి బోల్డ్ సినిమాలో పురుషుల సమస్యను ఎంచుకున్న నేపథ్యంలో, ఈ రెండో బోల్డ్‌లో మహిళల సమస్యను ఏమన్నా చూపిస్తారో అనే డౌటానుమానం కూడా ఉంది. మరి మేర్లపాక మదిలో ఏముందో చూడాలి. ఈ సినిమా కూడా యూవీ క్రియేషన్స్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ‘యూవీ కాన్సెప్ట్స్’లోనే వస్తుంది. ఓటీటీనా, థియేటరా అనేది కాలం నిర్ణయిస్తుంది.