Monkey Man: ‘మంకీ మ్యాన్’ కష్టాలు… కొత్త పాయింట్ యాడ్ అయ్యిందిగా!
April 8, 2024 / 11:16 AM IST
|Follow Us
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాతో మనకు బాగా పరిచయమైన దేవ్ పటేల్ ఇప్పుడు దర్శకుడిగా మారి ‘మంకీ మ్యాన్’ అనే సినిమా చేశాడు. హాలీవుడ్లో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఇండియాలో త్వరలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా మన దగ్గర విడుదలవ్వడానికి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. తాజాగా మరో పాయింట్ ఆ సమస్యలకు యాడ్ అవుతోందా? ఏమో సినిమాలో కథానాయికగా నటించిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది.
శోభిత ధూళిపాళ డిఫరెంట్ సినిమాలు ఎంచుకుంటూ కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటోంది. బోల్డ్ పాత్రలను కూడా ఓకే చేస్తూ వెర్సటైల్ నటి అనిపించుకునే ప్రయత్నంలో ఉంది. అలా ఆమె హాలీవుడ్లో లేటెస్ట్ చేసిన ఓ బోల్డ్ అటెంప్ట్ ‘మంకీ మ్యాన్’. ఏప్రిల్ 5న అమెరికాలో విడుదలైందీ సినిమా. ఇండియాలో ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తారట. ఈ సినిమా ప్రచారంలో భాగంగా శోభిత తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఆ పాత్ర పేరును ఇప్పుడు తప్పుగా తీసుకుంటారేమో అని డౌట్ ఏర్పడుతోంది.
‘మంకీ మ్యాన్’ సినిమాలో శోభిత సీత అనే వేశ్య పాత్రలో నటించిందట. ఆ పాత్ర చేసినందుకు తనకు గౌరవంగా ఉందని, సినిమాలో ఆ పాత్రకు అధిక ప్రాధాన్యం ఉందని చెప్పింది. అయితే ఇప్పటికే హనుమంతుడి స్ఫూర్తితో సినిమా చేశాం అని చెప్పి టీమ్ కాస్త ఇబ్బందుల్లో ఉంటే… వేశ్య పాత్రకు సీత అనే పేరు పెట్టారు అని తెలియడం ఇంకో ఇబ్బంది తెచ్చేలా ఉంది. అయితే మరి దీనిని టీమ్ ఎలా కన్విన్స్ చేస్తుందో చూడాలి.
అయితే సీత పాత్ర గురించి, శోభిత గురించి దేవ్ పటేల్ ఇటీవల మాట్లాడుతూ ‘మంకీ మ్యాన్’లో శోభిత తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని, ఇది ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అవుతుందని చెప్పాడు. ఆమె చాలా అందంగా ఆ పాత్రలో ఒదిగిపోయిందని కూడా చెప్పాడు.