Pavitra Lokesh: సోషల్ మీడియాలో పవిత్ర ఖాతాలో అరుదైన రికార్డ్.. ఏమైందంటే?

  • May 26, 2023 / 12:23 AM IST

ప్రముఖ టాలీవుడ్ నటి పవిత్ర లోకేశ్ పేరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ పెళ్లి సినిమాలో ప్రధాన పాత్రలో పవిత్ర లోకేశ్ నటించడంతో ఆమె పేరు మారుమ్రోగుతోంది. మరికొన్ని గంటల్లో మళ్లీ పెళ్లి మూవీ రిలీజ్ కానుండగా రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో చూడాల్సి ఉంది. మళ్లీ పెళ్లి మూవీకి బుకింగ్స్ పరవాలేదనే స్థాయిలో ఉండగా టాక్ పాజిటివ్ గా ఉంటే మాత్రం ఈ పరిస్థితి మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

పవిత్ర లోకేశ్ పేరు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలవడం గమనార్హం. గత కొన్నిరోజులుగా పవిత్ర లోకేశ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. మళ్లీ పెళ్లి సినిమా సక్సెస్ సాధిస్తే పవిత్ర కెరీర్ కు కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. పవిత్ర లోకేశ్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఆమె రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. పవిత్ర లోకేశ్ టాలెంటెడ్ నటి కాగా ఆమెకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

పవిత్ర లోకేశ్ (Pavitra Lokesh) సరైన పాత్రలను ఎంచుకుంటూ మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటే ఆమె కెరీర్ కు ఢోకా లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా పవిత్ర లోకేశ్ కు ఎక్కువగానే సినిమా ఆఫర్లు అయితే వస్తున్నాయని తెలుస్తోంది. అయితే పవిత్ర ఇతర ఇండస్ట్రీల ఆఫర్లకు ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

మళ్లీ పెళ్లి సినిమా కన్నడ భాషలో కూడా తెరకెక్కగా అక్కడ ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది. నరేష్ పవిత్ర కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus