వైజాగ్ లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు జరుగుతున్న అన్యాయం గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వైజాగ్ లో ఆరు ప్రైమ్ థియేటర్లలో వారసుడు మూవీ రిలీజ్ అవుతుండగా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు మాత్రం చెరో 4 థియేటర్లలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. ఈ వార్తల విషయంలో మెగా, నందమూరి అభిమానులు హర్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే నైజాంలో కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు అన్యాయం జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సినిమా రిలీజ్ కు 20 రోజుల సమయం మాత్రమే ఉన్నా థియేటర్ల లెక్క తేలలేదని బోగట్టా. ఈ సినిమాలకు అడిగిన థియేటర్లను ఇవ్వకుండా పెద్దగా పాపులారిటీ లేని థియేటర్లను ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. ప్రైమ్ థియేటర్ల విషయంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు అన్యాయం జరుగుతోందని సమాచారం. మైత్రీ నిర్మాతలు వేగంగా సమస్యలను పరిష్కరించుకోకపోతే మాత్రం అభిమానులు సైతం ఫీలయ్యే అవకాశం ఉంది. మెగా, నందమూరి అభిమానులు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఈ రెండు సినిమాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.
ఈ సినిమాలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ఛాన్స్ లేదని వాళ్లు చెబుతున్నారు. దిల్ రాజు వారసుడు రిలీజ్ కు సంబంధించి తమిళంలో ఒక విధంగా తెలుగులో మరో విధంగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు మీడియా ముందు మాత్రం తన తప్పేం లేదనే విధంగా చెబుతున్నారు. చిరంజీవి, బాలయ్య జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
దిల్ రాజు వైఖరిపై టాలీవుడ్ స్టార్ హీరోలు గుర్రుగా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తక్కువ థియేటర్లలో ఈ రెండు సినిమాలు విడుదలైతే కలెక్షన్లపై తీవ్రస్థాయిలో ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!