‘ఊపిరి’ హిట్ అయితే ‘ఎన్టీఆర్’ వల్లనే!!!

  • March 22, 2016 / 11:24 AM IST

నాగార్జున, కార్తి, తమన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఊపిరి సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ్ టీవీలకు తెగ ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను మనం ను మించిన హిట్ చెయ్యాలని అని భావిస్తున్నాడు. ఇదిలా ఉంటే తొలుత ఈ చిత్రంలో కార్తి క్యారెక్టర్ కు ఎన్టీఆర్ ను అనుకున్నారు, కానీ పాపం డేట్స్ అడ్జస్ట్ కాక ఎన్టీఆర్ ఈ ఈ అవకాశాన్ని వదులుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కు ఈ సినిమాకు ఏ మాత్రం సంబంధం లేదు, కానీ ఎన్టీఆర్ సెంటిమెంట్ ఇప్పుడు ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. అదేమిటంటారా…ఎన్టీఆర్ ఈ సినిమాను వదిలెయ్యడమే. అదేంటి ఎన్టీఆర్ సినిమా వదిలేస్తే హిట్ ఎలా అవుతుంది అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది అంటోంది ఎన్టీఆర్ సినీ కరియర్. ఇంతకీ అదేమిటి అంటే…జూనియర్ ఇప్పటివరకూ తను వదిలేసిన సినిమాలు వేరే హీరోలు చేసి సూపర్ హిట్ కొట్టారు. అందులో ముఖ్యంగా నితిన్ కరియర్ ను మలుపు తిప్పిన ‘దిల్’ సినిమా, బన్నీకు ఫిర్స్ద్ట్ హిట్ ‘ఆర్య’, రవితేజ కరియర్ లోనే భారీ హిట్స్ అయిన ‘భద్ర’, ‘కిక్’. ఇక తాజాగా ప్రభాస్ తన ఘాటును చూపించిన ‘మిర్చి’. ఈ సినిమాలన్నీ ఎన్టీఆర్ ఇతరత్రా కారణాల వల్ల వదిలేసినవే. అయితే ఇప్పుడు అదే సెంటిమెంట్ ఊపిరి విషయంలో కూడా వర్క్ అవుట్ అవుతుంది అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆ సెంటిమెంట్ వర్క్ అవుతుందో, లేకపోతే రివర్స్ అవుతుందో…మరో మూడు రోజులు ఆగితే గాని చెప్పలేం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus