Operation Valentine: ‘ఆపరేషన్ వాలెంటైన్’.. ఇంత బడ్జెట్లో ఎలా తీసేశారబ్బా.. గ్రేట్!
February 29, 2024 / 03:17 PM IST
|Follow Us
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు-హిందీలో ద్విభాషా చిత్రంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపొందింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్’, ‘సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్’ వారు నిర్మించగా, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరించారు. రుహాని శర్మ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.
మార్చి 1న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది. సెన్సార్ కూడా పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్లో విజువల్స్ టాప్-నాచ్ అనే విధంగా ఉంటాయి. దీంతో వరుణ్ తేజ్ కెరీర్లో ఈ సినిమా హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందింది అని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాకి అయిన బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
‘ఆపరేషన్ వాలెంటైన్’ కి (Operation Valentine) కేవలం రూ.42 కోట్లు బడ్జెట్ అయ్యిందట. ప్రమోషన్స్ కి రూ.8 కోట్లు ఖర్చు చేశారట. మొత్తంగా రూ.50 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమా ఫినిష్ అయినట్లు తెలుస్తుంది. రూ.50 కోట్ల బడ్జెట్ లో ఇలాంటి సినిమాని ఫినిష్ చేయడం అంటే మాటలు కాదు. స్క్రిప్ట్ పక్కాగా ఉండటం వల్లే అది కుదిరింది అంటూ మేకర్స్ చెబుతున్నారు.