Yogi: యోగి సాంగ్ కాపీ ఆరోపణలపై అసలు క్లారిటీ ఇదే.. అసలేం జరిగిందంటే?

  • August 28, 2023 / 06:37 AM IST

ప్రభాస్ వి.వి.వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఏకైక సినిమా యోగి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. క్లైమాక్స్ విషయంలో చేసిన పొరపాట్ల వల్ల ఈ సినిమా భారీ సక్సెస్ కాలేదని చాలామంది భావిస్తారు. యోగి టైటిల్ సాంగ్ ఓరోరి యోగి నన్ను కోరికయిరో ఓరోరి యోగి నన్ను నమీలైరో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన రమణ గోగుల ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

అయితే ఈ సాంగ్ కన్నడ సాంగ్ కు కాపీ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే వాస్తవం ఏంటంటే ఏ సినిమా నుంచి ఓరోరి సాంగ్ కాపీ అని ప్రచారం జరుగుతుందో ఆ సినిమాకు రీమేక్ గానే యోగి సినిమా తెరకెక్కింది. జోగి సినిమా మ్యూజిక్ రైట్స్ పై కూడా హక్కులు ఉండటంలో యోగి సినిమాలో అదే ట్యూన్ ను తీసుకున్నారు.

యోగి టైటిల్ సాంగ్ కాపీ అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఈ ట్యూన్ విషయంలో రమణ గోగుల వైపు నుంచి కూడా ఎలాంటి తప్పు లేదు. ప్రభాస్ తన సినిమా కెరీర్ లో ఎక్కువ సంఖ్యలో రీమేక్ సినిమాలలో నటించలేదు. ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది.

సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించి మరో రెండు రోజుల్లో అప్ డేట్ రానుందని తెలుస్తోంది. సలార్, సలార్2 సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్ల రిలీజ్ కానున్నాయి. సలార్2 విడుదలైన తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సమయానికి ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus