ఓటీటీలే సినిమా రిలీజ్ డేట్..లను డిసైడ్ చేస్తున్నాయా?
March 27, 2024 / 12:04 PM IST
|Follow Us
కోవిడ్ తర్వాత ఓటీటీల హవా బాగా పెరిగింది. ఆ టైములో థియేటర్లు మూతపడి ఉంటే.. ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందించింది ఓటీటీలే అనడంలో అతిశయోక్తి లేదు. నాని (Nani) ‘వి’ (V Movie), సూర్య (Suriya) ‘ఆకాశమే నీ హద్దురా’ వంటి సినిమాలు ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ఇక కోవిడ్ తర్వాత థియేటర్లకు జనాలు రావడం బాగా తగ్గించారు. సినిమా బాగుంటే తప్ప జనాలు థియేటర్ కి వెళ్లడం లేదు. మరో పక్క టికెట్ రేట్లు కూడా సమస్యగా మారింది.
ఇవన్నీ కూడా జనాలను థియేటర్లకు దూరం చేస్తున్నాయి అనే అభిప్రాయం జనాల్లో ఉన్నాయి. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఓటీటీలు జనాలను థియేటర్లకు దూరం చేస్తున్నాయి అనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. కాకపోతే.. ఓటీటీల విషయంలో నిర్మాతల అభిప్రాయం వేరేగా ఉంది. అదేంటి అంటే.. ఏ సినిమాకి అయినా ఓటీటీల రూపంలో చాలావరకు రికవరీ ఉంటుందట. అయితే ఈ మధ్య మిడ్ రేంజ్ హీరోల సినిమాలకి కూడా బిజినెస్ జరగడం లేదు అనే టాక్ కూడా జరుగుతుంది కదా..?
అయితే సినిమాలకి ప్లాప్ టాక్ కనుక వస్తే జనాలు థియేటర్లకు వెళ్ళరు. ఎలాగూ ఓటీటీకి వస్తుంది కదా అప్పుడు చూసుకుందాం అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అలాంటి ఆలోచన కూడా మేకర్స్ కి పనికొస్తుంది అని చెప్పొచ్చు. ఏదేమైనా ఓటీటీల వల్ల అడ్వాన్స్..ల రూపంలో, వ్యూయర్ షిప్ బేస్..ల రూపంలో 60 శాతం బడ్జెట్లో రికవరీ అవుతుంది అని స్పష్టమవుతుంది.