కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాలతో పోలిస్తే ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే అక్కినేని హీరోలు నటించిన లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆలస్యంగా విడుదలైనా అక్కినేని అఖిల్ కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ సొంతమైంది. అక్కినేని ఫ్యాన్స్ కోరుకున్న సక్సెస్ ఈ సినిమాతో అఖిల్ కు దక్కింది.
గీతా ఆర్ట్స్2 బ్యానర్ కు ఈ సినిమాతో భారీగా లాభాలు సొంతమయ్యాయని సమాచారం. గత నెల 15వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఆహా ఓటీటీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజవుతుందని మొదట వార్తలు వచ్చినా ఆహాతో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లకు దాదాపుగా 3 కోట్ల రూపాయల లాభాలు వచ్చినట్టు సమాచారం.
ఈ నెల 19వ తేదీ నుంచి ఓటీటీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అందుబాటులోకి రానుంది. రిలీజైన ఐదు వారాలకే అఖిల్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుండటం గమనార్హం. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించగా ఈ సినిమాలోని పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాలోని లెహరాయి పాట యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాతో మరోసారి గోల్డెన్ లెగ్ అని ప్రూవ్ చేసుకుంది. థియేటర్లలో హిట్ అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా హిట్ టాక్ తెచ్చుకుంటుందేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!